తెలంగాణ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.రాజకీయ పార్టీలకు ప్రచారానికి ఇంకా 49 రోజుల రోజుల సమయం మాత్రమే ఉంది.బీఆర్‌ఎస్ ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించగా,ఒకటి రెండు రోజుల్లో తొలి జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అయితే,బీజేపీ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి నుంచి తమ పార్టీకి 6 వేల దరఖాస్తులు వచ్చాయని బీజేపీ సగర్వంగా ప్రకటించింది.కానీ ఇంకా తుది జాబితా విడుదల చెయకపోవడం గమనార్హం
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది .తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికల వేడి పెరిగింది .బీఆర్‌ఎస్ ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించగా,ఒకటి రెండు రోజుల్లో తొలి జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అయితే,బీజేపీ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.తమకు ఆరు వేల దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నవాస్తవికత ఈ మాటకు భిన్నంగా ఉంది. చాలా సెగ్మెంట్లలో సరైన అభ్యర్థులు దొరక్క బీజేపీ నానా తంటాలు పడుతోంది.దీంతో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న బండి సంజయ్,కిషన్ రెడ్డి, అరవింద్,డీకే,జితేందర్ సహా సీనియర్ నేతలందరినీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది.మరోవైపు విజయశాంతి,వివేక్,కోమటిరెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి నేతలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు నిరాకరించారు.ఈ నేతలు ఇటీవల మోదీ, అమిత్ షాలతో సమావేశాలకు హాజరుకాలేదు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎలా ఉన్నా,మొత్తం 119 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను వెతకక తప్పని పరిస్థితిలో బీజేపీ ఉంది.ఇదిలా ఉండగా అమిత్ షా నిన్నజరిగిన తన తెలంగాణ పర్యటనలో భాగంగా నిన్న మధ్యాహ్నం ఆదిలాబాద్ లో జరిగిన బిజేపి బహిరంగ సభ లో పాల్గొన్నారు .ఆదిలాబాద్ సభలో మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లు కొత్త బట్టలు వేసుకొని వస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల గురించి మాట్లాడుతుంది కానీ.. పేదల కోసం ఏమీ చేయబోదని విమర్శించారు. దళితులు, గిరిజనులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, కేసీఆర్ మాత్రం పదేళ్లుగా తన ఫ్యామిలీ కోసమే పని చేస్తూ వస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌ను సీఎం చేయడం కోసమే నిరంతరం పని చేస్తూ ఉంటారని అన్నారు. తరువాత నిన్న సాయంత్రం సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావులతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా మాట్లాడారు.అనేక రంగాల్లో మన దేశం అగ్రస్థానానికి చేరబోతోందని.. బీజేపీ సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్‌కు ఏం విధానం ఉందని ప్రశ్నించారు.
Discussion about this post