శుభలగ్నం సినిమాలో ఆమని తన భర్త జగపతిబాబును రోజాకి అమ్మేసే సీన్ చూసి ఇలాంటి వారు ఉంటారా.. అంటూ హంగామా చేసారు. కానీ ఇప్పుడు ఆ సినిమా ఇన్‌స్పిరేషనో ఏమో గానీ నిజంగానే అటువంటి సంఘటన జరిగింది. అదెక్కడో మీరే చూడండి…
భర్త తిరుగుబోతు, తాగుబోతు అయినా భరించేవాళ్లు వున్నారు. కానీ భర్తను అమ్మేసే వాళ్లు ఉన్నారని మాత్రం ఎక్కడా విని వుండము. కానీ కర్ణాటకలో మాత్రం ఇలానే జరిగింది. కర్ణాటక మాండ్యలో ఓ గృహిణి తన భర్త ఓ మహిళతో సన్నిహితంగా వుండటం చూసింది. … దీంతో ఆ మహిళ నీ భర్త నా దగ్గర ఐదు లక్షలు తీసుకున్నాడు. అవి ఇచ్చేసి నీ భర్తను తీసుకెళ్ళమంది. అయితే ఆ మహిళ మాత్రం ఐదు లక్షలు ఇవ్వకపోగా రివర్స్ షాక్ ఇచ్చింది.
ఇలాంటి భర్త నాకొద్దు …. నాకే మరో 5లక్షలు ఇచ్చి నువ్వే ఉంచుకో అని మహిళకు బదులిచ్చింది… ఇది చిలికి చిలికి గాలివాన కావడంతో ఊళ్లోని పెద్దలు కలుగచేసుకుని గృహిణిని, రెండో మహిళను సముదాయించారు. భర్తను చివరికి ఇంటికి పంపించి వేసారు.
Discussion about this post