భారతీయ చలన చిత్ర పరిశ్రమ తీరుతెన్నులు సమూలంగా మారిపోతున్నాయి. ప్రతిభావంతులకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. టాలెంట్ ఉన్న దర్శకులతో పని చేయడానికి అటు టాప్ హీరోలు, ఇటు పెద్ద నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ మధ్యే తమిళ్ డైరెక్టర్ అట్లీతో కలిసి జవాన్ సినిమా చేసిన షారుక్ ఖాన్ సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో క్రేజీ మల్టీ స్టారర్ పట్టాలెక్కబోతోంది
బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టిన జవాన్ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. విజయ్ సేతుపతి విలన్ గా నటించగా.. నయనతార హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ నేపథ్యంలో దళపతి విజయ్, షారుఖ్ ఖాన్ తో ఓ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించనున్నాడు అట్లీ. ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు అట్లీ.
జవాన్ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతున్న సమయంలో విజయ్ అక్కడికి వచ్చారని, షారుక్ , విజయ్ చాలా సేపు మాట్లాడుకున్నారని అట్లీ తాజా ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. ఆ సమయంలో షారుక్ తనతో మాట్లాడుతూ మా ఇద్దరితో కలిసి సినిమా చేయాలనుకుంటే చెప్పు.. చేస్తామని చెప్పారని అట్లీ వివరించాడు. దీనికి విజయ్ కూడా ఒప్పుకున్నారని వెల్లడించాడు.
ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోల ఇమేజ్ కు తగ్గ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నానని అట్లీ చెప్పాడు. ఆ మల్టీ స్టారర్ తో రూ. 3 వేల కోట్లు వసూలు చేయాలనేది తన టార్గెట్ అని కూడా చెప్పి షాకిచ్చాడు. ఈ న్యూస్ వైరల్ అవుతుండటంతో ఇద్దరు హీరోల అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Discussion about this post