ట్రెండింగ్ లోకి రావటానికి వర్ధమాన సినీ నటులు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఆ కోవలోకే వస్తుంది తెలుగు నటి రేఖా భోజ్ తాజా ఆఫర్. గతంలో నటి పూనమ్ పాండే ఇచ్చిన ఆఫర్ నే ఇప్పుడు తాను కూడా ఇచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నవంబర్ 19న జరగనున్న ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ లో ఇండియా గెలిస్తే వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానని ప్రకటించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
2011 ప్రపంచకప్ సందర్భంగా బాలీవుడ్ నటి పూనమ్ పాండే చేసిన ప్రకటన హాట్ టాపిక్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇండియా ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతానని అంటే స్ట్రీకింగ్ చేస్తానని ప్రకటించి పూనమ్ పాండే అందర్నీ ఆకర్షించింది. అయితే ఇండియా ప్రపంచకప్ గెలిచింది గానీ పూనమ్ పాండే మాత్రం ఆ పని చేయలేదు. ఫలితంగా హెవీగా ట్రోల్ అయింది.
ఇప్పుడు పూనమ్ పాండే బాటలో విశాఖకు చెందిన తెలుగు వర్ధమాన నటి రేఖా భోజ్ అదే తరహా ప్రకటన చేసింది. ఇండియా ప్రపంచకప్ గెలిస్తే విశాఖపట్నం బీచ్లో నగ్నంగా తిరుగుతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండే రేఖా బోజ్… మాంగళ్యం, దామినీ విల్లా, కలాయ తస్మె నమః, కాత్సాయని, స్వాతి చినుకు, రంగీలా వంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అప్పట్నించి సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతోంది.
ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్ పోటీల్లో తమ జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంలో కొంతమంది దుస్తులు తొలగించి పరుగులు తీస్తుంటారు. అలా ఒంటిపై బట్టల్లేకుండా పరుగుపెట్టడాన్ని స్ట్రీకింగ్ అంటారు. ఈ కల్చర్ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు రేఖా భోజ్ కూడా అలా చేస్తానంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రేఖా భోజ్ రిప్లై ఇస్తూ .. క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తానంటున్నానని.. అంతే తప్ప హైప్ కోసం కాదని స్పష్టం చేసింది.
Discussion about this post