ఎవరైనా విదేశీ పర్యటన చేయాలంటే ప్రధానంగా ఉండాల్సినవి రెండు. వీటిలో మొదటిది పాస్ పోర్ట్, రెండోది వీసా. ఏ విదేశం వెళ్లాలన్నా పాస్ పోర్ట్ తప్పనిసరి. కానీ వీసా లేకుండా కొన్ని దేశాలకు వెళ్లవచ్చు. వీసా లేకుండా భారతీయులు వెళ్లగలిగే దేశాలు చాలానే ఉన్నాయి. ఈ జాబితాలో కొత్తగా శ్రీలంక చేరింది. పరస్పర ఒప్పందాల వల్ల కొన్ని దేశాలకు వీసాలు అవసరం లేదు. మరి కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానం ప్రకారం వీసా అవసరం లేకుండానే అనుమతిస్తున్నాయి.
భారతీయులు వీసా లేకుండానే రావచ్చని మన పొరుగు దేశం శ్రీలంక తాజాగా ప్రకటించింది. శ్రీలంక కాకుండా ప్రపంచంలోని మరో 26 దేశాలకు కూడా భారతీయులు వీసా లేకుండా వెళ్ల వచ్చు. వీటిలో అల్బెనియా, బార్బడాస్, భూటాన్, నేపాల్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్, డొమెనికా, ఎల్ సాల్వెడర్, ఫిజి, గ్రెనెడా, హైతీ, జమైకా, కజకిస్తాన్, మాకావ్, మారిషస్, మైక్రోనేసియా, మాంటెసరట్, నియావ్, కతార్, ఒమన్, సెనగల్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ విన్సెన్ట్ అండ్ ది గ్రెనెడిన్స్, ట్రినిడాడ్ అండ్ టుబాగో, ట్యునీషియా, వనవుతు దేశాలు ఉన్నాయి.
భారతీయులు మరి కొన్నిదేశాలకు ఈ-వీసా, వీసా ఆన్ ఎరైవల్ లతో వెళ్ళవచ్చు. వీటితో ఇండోనేషియా, జోర్డాన్, కంబోడియా, బొలీవియా, బురుండి, ఇథియోపియా, ఇరాన్, మడగాస్కర్, మాల్దీవులు, మొజాంబిక్, మయన్మార్, ఉగాండా, జింబాబ్వేతో పాటు మరికొన్ని దేశాలకు వెళ్లవచ్చు. అలాగే ఈ-వీసాతో ఆస్ట్రేలియా, మలేసియా, రష్యా, సింగపూర్, కువైట్, టర్కీ, వియత్నాం, అంగోలా, అజర్బైజాన్, బహ్రెయిన్, కొలంబియా, జార్జియా, కెన్యా, మొరాకో, సురినాం, తైవాన్, ఉజ్బేకిస్తాన్, జాంబియాతో పాటు మరికొన్ని దేశాలకు వెళ్ల వచ్చు.
Discussion about this post