రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్దితుల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్ధుల జాబితాల్ని విడుదల చేశాయి. ఇందులో రాష్ట్రంలో కుల సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన ప్రాధాన్యతలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఓబీసీలకు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ దాదాపు సమానంగా ప్రాధాన్యత ఇవ్వగా.. అగ్రకులాలకు మాత్రం బీజేపీ జాబితాలో ప్రాధాన్యత లభించింది.
బీహార్ లో కుల సర్వే ఫలితాలు వెలువడ్డాక దేశవ్యాప్తంగా కులగణన చేయిస్తామంటూ కాంగ్రెస్ ఇస్తున్న హామీపై ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కులసమీకరణాల ప్రభావం ఎక్కువగా ఉన్న రాజస్తాన్ పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యం చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈసారి రాజస్తాన్ లో మూడింట ఓ వంతు టికెట్లను వారికి కేటాయిచింది. ఓబీసీలకు బీజేపీ 70 టికెట్లు ఇవ్వగా… కాంగ్రెస్ మాత్రం 72 టిక్కెట్లు ఇచ్చింది.
బీజేపీ జాబితాలో స్పష్టమైన అగ్రవర్ణ ప్రాధాన్యం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన 199 మంది అభ్యర్థుల్లో 44 మంది అగ్రవర్ణాలకు చెందినవారు కాగా, బీజేపీ 63 మంది అగ్రవర్ణాల అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్ కి భరత్‌పూర్‌ను కాంగ్రెస్ కేటాయించింది. గతసారి కూడా భరత్‌పూర్‌లో ఆర్ఎల్డీ విజయం సాధించింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ గార్గ్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఓబీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన 72 టిక్కెట్లలో జాట్‌లకు 34 ఉన్నాయి. అలాగే 11 గుజ్జర్లకు, 4 యాదవులు, బిష్ణోయిలకు, మాలీలకు 3 చొప్పున, పటేల్‌లకు, కుమ్హర్‌లు, కలాల్‌లకు ఒక్కొక్కరు చొప్పున ఇచ్చారు.
రాష్ట్రంలో ఈసారి అధికార మార్పు ఖాయమని పలు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజా జాబితా్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నలుగురు మంత్రులకు టికెట్లు నిరాకరించడంతో పాటు గెలుపు గుర్రాలకు ఎక్కువగా టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
























Discussion about this post