సిరిసిల్ల …. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. 2009,2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ వరుస విజయాలు సాధించారు. అక్కడ కేటీఆర్ గెలుపును అడ్డుకోవాలని విపక్షాలు ఈ సారి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.
2009లో 171 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి పై గెలిచిన కేటీఆర్ 2014 ఎన్నికల్లో 53 వేల మెజారిటీ తో విజయం సాధించారు. . మూడో సారి 89 వేల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. నియోజక వర్గం పై మెల్లగా పట్టు బిగించారు. నాలుగో సారి పోటీ చేస్తున్న కేటీఆర్ గెలుపు. పై నమ్మకంతో దూసుకుపోతున్నారు. తండ్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజక ఇంచార్జి గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపున మళ్ళీ మహేందర్ రెడ్డి ..బీజేపీ తరపున రాణిరుద్రమ దేవి ఎన్నికల బరిలోకి దిగారు. ఇక్కడ స్థానికులకే టికెట్ వస్తుందని బీజేపీ నేతలు భావించారు. అయితే.. బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాణిరుద్రమకు టికెట్ కేటాయించడంతో.. స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని నేతలు అగ్రనేతలపై మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఎన్నో యేళ్లుగా పార్టీలో ఉన్న నేతలు కూడా.. బీజేపీని వీడుతున్నారు. .పార్టీలో అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఇక్కడ బీజేపీ బలపడుతూ వస్తుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ కేవలం రెండు వేల మెజారిటీ మాత్రమే బీఆర్ఎస్ సాధించింది. తరువాత… జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటు శాతం పెంచుకుంది.
సిరిసిల్ల టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు బీజేపీ నేతలు పోటీ పడ్డారు. అయితే.. స్థానికులకు కాకుండా రాణిరుద్రమకు టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. దీంతో స్థానిక నేతలందరూ మూకుమ్మడిగా అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఆశించిన.. లగిశెట్టి శ్రీనివాస్. రమకాంత్, అన్నలదాసు వేణు బీజేపీకి గుడ్‌బై చెప్పారు. రమాకాంత్, కేటిఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిపోయారు.మిగతా నేతలు పార్టీలో ఉన్నా సైలెంట్ గా ఉంటున్నారు.
మంత్రి కేటీఆర్‌ను ఎదుర్కోవడానికి రాణిరుద్రమను బరిలోకి దింపితే . ఇక్కడ మాత్రం.. అందుకు భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ మాత్రం కార్యకర్తలను బుజ్జగించే పనిలో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. ఎన్నికల నాటికైనా అసంతృప్తులు దారికి వస్తారో లేదో… చూడాలి.
Discussion about this post