రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎద్దు,వ్యవసాయం తెలియని వ్యక్తులు అని, రాహుల్,రేవంత్ కు తెలిసిందే పబ్బులు, చిందులు వెయ్యడమే తెలుసు అని కే టి ఆర్ విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు అన్ని దొంగమాటలు చెప్పి, తెలిచారని కె టి ఆర్ అన్నారు.దుబ్బాకను ఏమి అభివృద్ధి చేయలేదని ఆయన తెలిపారు. రఘునందన్ రావు ఇచ్చిన ఒక్కమాట నిలబెట్టుకోలేదు, అలాంటి వ్యక్తి ఓటుఎలా వేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు కర్ణాటక, గుజరాత్ నుంచి డబ్బులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో పాల్గొన్నారు.
రోడ్ షాపు ప్రజలు, బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ కోరారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
Discussion about this post