పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం లో సీఎం కేసీఆర్ పై పోటీ చేయబోతున్నట్టు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. . కొడంగల్ నుంచి రేవంత్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.
ఇప్పటికే గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీకి దిగుతున్నట్టు ప్రకటించారు.
రాజేందర్ కార్యక్షేత్రం లోకి కార్యకర్తలతో సమావేశం అవుతూ .. ఓటర్లను కలుస్తూ దూసుకుపోతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు రేవంత్‌ను కూడా కామారెడ్డి నుంచి పోటీ చేయించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
కామారెడ్డి నుంచి టికెట్ ఆశించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో షబ్బీర్అలీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ తరఫున ప్రచార బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది. అధికారికంగా జాబితా వెల్లడైన తర్వాతనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి . కామారెడ్డి లో బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దించే యత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కామారెడ్డి ఎన్నికల బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు. 2014 లో కామారెడ్డి లో టీఆర్ఎస్ అభ్యర్థి గంపా గోవర్ధన్ 4554 ఓట్ల ఆధిక్యతతో .. 2018 లో 8683 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇటీవల చేయించిన సర్వేలలో ఇక్కడ పార్టీ ప్రభావం తగ్గినట్టు తేలడంతో జిల్లాలోని నేతలలో .. శ్రేణుల్లో జోష్ తెచ్చే యోచనలో భాగం గానే కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇపుడు రేవంత్ రంగం లోకి ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద కేసీఆర్ ను ఇరకాటం లో పెట్టేందుకు బీజేపీ .. కాంగ్రెస్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
Discussion about this post