ప్రస్తుతం రోజులు వేగంగా మారిపోతున్నాయి. అందరి జీవితాలు బిజీ బిజీ అయిపోయాయి. థియేటర్ కి వెళ్లి సినిమా చూసేంత తీరిక.., ఓపిక చాలా మందికి ఉండటం లేదు. అందుకే మూవీ లవర్స్ ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లే ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకివచ్చాయి. దీనికి తగినట్టే మూవీ లవర్స్ కి వచ్చే వారం అంతా పండగే. ఎందుకంటే ఏకంగా 31 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
వచ్చే వారం రోజుల్లో స్ట్రీమింగ్ కానున్న మూవీస్ లిస్టులో ‘లియో’, ‘కన్నూరు స్క్వాడ్’, ‘చిన్నా’, ‘ద ఫ్లాష్’ చిత్రాలు.. ఉన్నాయి. వీటితోపాటు ‘సుఖి’, ‘అపూర్వ’ మూవీస్ తో పాటు ‘ద రైల్వే మెన్’ వెబ్ సిరీస్ కూడా ఉంది. ఇంకా వివిధ దేశాలు, భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ సినీ ప్రేమికులను అలరించబోతున్నాయి.
లియో తెలుగు డబ్బింగ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో నవంబరు 16 న స్ట్రీమింగ్ కానుంది. అపూర్వ హిందీ మూవీ .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 15 న ప్రసారం అవబోతోంది. ఇక ఇదే ఓటీటీ లో కన్నూర్ స్క్వాడ్, చిన్నా తెలుగు డబ్బింగ్ మూవీలు నవంబర్ 17న అలరించబోతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ లో ట్విన్ లవ్ ఇంగ్లీష్ సిరీస్ నవంబరు 17 న, నెట్ ఫ్లిక్స్ లో నవంబరు 18 న ద రైల్వే మెన్ హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. జియో సినిమాలో.. ది ఫ్లాష్.. ఇంగ్లిష్ మూవీ నవంబర్ 15 న ప్రసారం కానుంది.
Discussion about this post