ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ నేతల మాటల దాడి మరింత పెరిగింది. తన వ్యాఖ్యలతో కలకలం రేపే వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబును ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చంద్రబాబు పోతాడు, జగన్ సీఎం అవుతాడంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దీంతో తన ఉద్దేశం అది కాదంటూ టీడీపీ రాజకీయంగా చనిపోతుందని మాత్రమేనంటూ వివరణ కూడా ఇచ్చారు.
గోరంట్ల మాధవ్ మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేసాడు. గతంలో చంద్రబాబు పోతాడు, జగన్ సీఎం అవుతాడంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యల్ని అటు ఇటుచేసి అదే అదే మీనింగ్ వచ్చేలా కామెంట్స్ చేసాడు. చంద్రబాబు బతకాలి… జగన్ రెండోసారి సీఎం కావడం చూసి ఆయన ఏడవాలి అంటూ వ్యాఖ్యానించాడు.
అంతే కాకుండ టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపింది సీఎం జగన్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని గోరంట్ల మాధవ్ తప్పుబట్టారు. చంద్రబాబు కేసులో “ఎఫ్ఐఆర్ నమోదు చేసింది పోలీసులు, జగన్ కాదన్నారు.. దర్యాప్తు చేసింది పోలీసులు, జగన్ కాదన్నారు. చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపింది నువ్వో, నేనో, ఇంకెవరో కాదని, కోర్టుకు ఆ అధికారం ఉందని గోరంట్ల తెలిపారు. జడ్జిలకు ఆ అధికారం ఉందన్నారు. కోర్టు చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిందని, జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తి జైల్లోనే ఉండాలన్నారు.
మరోవైపు జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ఈ ప్రభుత్వానిదే భరోసా అని గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. జైల్లో అందరు ముద్దాయిల కంటే చంద్రబాబు పెద్ద ముద్దాయి కాబట్టి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుందన్నారు. చంద్రబాబు ప్రాణాలకు ఈ ప్రభుత్వం ప్రాణాలైనా అడ్డువేసి బతికిస్తుందన్నారు. చంద్రబాబు బతకాలి… 2024లో జగన్ మళ్లీ సీఎం కావడాన్ని ఆయన చూడాలనేది మా ఆకాంక్ష. చంద్రబాబు చనిపోవడానికి వీల్లేదు” అంటూ గోరంట్ల మాధవ్ అన్నారు.
Discussion about this post