భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 13 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో రోజుకు ఒక అవతారంలో దర్శనమిస్తున్న స్వామి వారికి ఈనెల 22న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. 23 ఉదయం ఉత్తర ద్వార దర్శనం వేడుక జరగనున్నాయి. వామన అవతారంలో వున్న స్వామివారిని ప్రధాన ఆలయంలో బేడ మండపం వద్దకు తీసుకువచ్చి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రధానాలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలవరులకు విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు.
























Discussion about this post