కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీతో రూపొందించిన చాట్‌జీపీటీతో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. అదే సమయంలో అకృత్యాలకూ పాల్పడవచ్చు. దీనిని చాలామంది తమ సృజనాత్మక ఆలోచనలకు రూపం ఇవ్వడానికి ఉపయోగించుకుంటున్నారు. కొందరు మాత్రం డీప్ ఫేక్ వీడియోలలాంటి అకృత్యాలకు వినియోగించుకుంటున్నారు. అయితే చాట్ జీపీటీ సేవలు కొంతవరకు మాత్రమే ఉచితం. తర్వాత ప్రీమియం చెల్లించాలి.
కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీతో రూపొందించిన చాట్ జీపీటీ లాంటి ప్లాట్ ఫార్మ్స్ మరికొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉచితంగా వాడుకోవచ్చు. గూగుల్‌కు బదులుగా ఏఐ ఆధారిత సెర్చింజన్ బింగ్‌నూ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన దీనిలో ఏఐ ఆధారిత చాట్ జీపీటీ కూడా ఉంది. దీని వెబ్‌సైట్‌లోకి వెళ్లి బింగ్ చాట్‌తో కంటెంట్ సృష్టించుకోవచ్చు. రైటింగ్ అసిస్టెంట్ సాయంతో మెయిళ్లు రాసుకోవచ్చు. యాప్ రూపంలోనూ దీని సేవలను పొందొచ్చు. ఇక.. ఏఐ ఆధారిత కోపైలట్ విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
క్రోమ్ చాట్‌జీపీటీ ఎక్స్‌టెన్షన్ అయిన మెర్లిన్ ద్వారా దేన్నయినా యాక్సెస్ చేయవచ్చు. బ్లాగులు, యూట్యూబు వీడియోలు, వెబ్‌సైట్ల సారాంశాన్ని ఇది చిటికలో మన ముందుంచుతుంది. దీని సహాయంతో సోషల్ మీడియా కంటెంట్ సృష్టించుకోవచ్చు. మెర్లిన్‌లోని కృత్రిమ మేధ ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నలకైనా సమాధానాలివ్వగలదు.
కోరాకు చెందిన ఏఐ యాప్ పేరు.. పోయ్. క్లౌడ్ దగ్గరి నుంచి ఓపెన్‌ఏఐకి చెందిన చాట్ జీపీటీ వరకు రకరకాల ఏఐ మోడళ్లను వాడుకోవటానికి ఈ యాప్ వీలు కల్పిస్తుంది. అత్యంత అధునాతన ఏఐ టెక్నాలజీతో రూపొందిన ఈ యాప్ ఇంటర్ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Discussion about this post