చంద్రబాబు అరెస్ట్ నందమూరి కుటుంబంలో చీలికను తెచ్చింది. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ మౌనం వహించడంపై, నందమూరి బాలకృష్ణ స్పందించడం తీవ్ర చర్చకు దారితీసింది. సహజంగానే బాలయ్య వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక వర్గం మండిపడుతోంది. నందమూరి కుటుంబంలో అందరి అస్తిత్వమైన తెలుగుదేశం పార్టీకి ఇంతటి క్లిష్టమైన అంశంలో కూడా ఎన్టీఆర్ లెక్కలు మరీ ఎక్కువగా వేస్తున్నారని నందమూరి, టీడీపీ మద్దతుదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ అంటున్నారు టీడీపీ మద్దతుదారులు. ఇక జూనియర్ స్పందించకపోవడం పై హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియా వేదికగా స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకు ఐ డోంట్ కేర్.. ఐ డోంట్ కేర్ బ్రో అంటూ బాలకృష్ణ ఇచ్చిన సమాధానం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. చంద్రబాబు అరెస్ట్ పై నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్పందిస్తారని ఆశించారు. కానీ వారు స్పందించలేదు. ముఖ్యంగా జూనియర్ పైనే తెలుగు తమ్ముళ్ళు ఫోకస్ పెట్టారు. తారక్.. చంద్రబాబు అరెస్ట్ గురించి ఏ విధంగానూ రెస్పాండ్ అవ్వలేదు. అయితే ఇప్పుడు తారక్ ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ఇలాంటి వాటిల్లో ఆయన్ని లాగవద్దని జూనియర్ అభిమానులు కోరారు. అయినా సరే రాజకీయాలలో జూనియర్ పేరు పదే పదే ప్రస్తావనకు వస్తూనే ఉంది. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదంటూ టీడీపీ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అస్సలు అవేవీ పట్టించుకోకుండా తన పని తాను కూల్ గా చేసుకుపోతున్నారు.
చంద్రబాబుతో వివేదాలు ఉన్నపటికీ ఆయన అరెస్టు వ్యవహారంపై బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి ఖండించారు. ఇక మిగిలిన కుటుంబసభ్యులు కూడా నారా ఫ్యామిలీని ఓదార్చారు. కొంతమంది రాజమండ్రి వెళ్లి భువనేశ్వరికి సంఘీభావం ప్రకటించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కానీ, కల్యాణ్ రామ్ కానీ అస్సలు ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి వాటికి కల్యాణ్ రామ్ సాధారణంగానే దూరంగా ఉంటారు. తారక్ మాత్రం సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా కనిపిస్తారు. అయినా అలా కూడా ఆయన రియాక్ట్ కాకపోవడం టీడీపీ ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. జూనియర్ ఎన్టీఆర్ గోడమీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
పవన్ కల్యాణ్ బయటి వ్యక్తి. అతడు ఎప్పుడూ స్పందించకుండా తప్పించుకోగలడు. జగన్, చంద్రబాబు ఇద్దరూ అవినీతిపరులేనంటూ పరిస్థితిని కూడా వాడుకోగలరు. కానీ ఈ కష్టకాలంలో ఆయన చంద్రబాబుకు అండగా నిలిచారు’ అని అంటున్నారు. దీనికి భిన్నంగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడని, దీనిపై ఆయన స్పందించడం లేదంటున్నారు. నందమూరి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఈ రోజు ఇలా ఉండేందుకు కారణం టీడీపీ, నందమూరి కుటుంబ పేరు. ఇంత పెద్ద ఇష్యూలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పూర్తిగా అన్యాయమన్నారు. భువనేశ్వరి విషయంలో మాదిరిగా ఆయన కనీసం లాంఛనప్రాయమైన వైఖరిని అవలంభించి ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. కానీ యంగ్ టైగర్ ఏదైనా ఒక ప్రకటన రిలీజ్ చేస్తే నందమూరి వారసుడిగా ఆయనకు మరింత గౌరవం పెరిగేది. కానీ పార్టీ ఎటుపోయినా.. ఎవరు ఎటు పోయినా పట్టించుకోకపోవడంపై కామన్ గానే టీడీపీ అభిమానులు ఫైర్ అవుతుండగా.. యంగ్ టైగర్ అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు.
Discussion about this post