Telangana Talli: విగ్రహంపై వివాదం… అప్పుడు… ఇప్పుడు అసలు తేడా…
తెలంగాణ తల్లి ( Telanaga Talli ) ఇప్పుడు రాజకీయాల్లో లొల్లిగా మారింది… మేము చెప్పేదే అసలైన తెలంగాణ తల్లి అంటే… కాదు కాదు… మేము చెప్పేదే నిజమైన తెలంగాణ తల్లి అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు వాదనలకు దిగుతున్నాయి.
వాదనలకు దిగడమే కాదు పోటీ పోటీగా విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతున్నాయి. ఇప్పుడు ఈ విషయమే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇరు పార్టీలు ఎందుకు వాదన చేస్తున్నాయో? ఎవరి వాదన సరైందే అర్థం కాక సగటు జీవి తల పట్టుకుంటున్నారు.
రూపం మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం
వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన కోరుతూ జరిగిన ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలంటూ చర్చ వచ్చింది. అయితే సమైక్య వాదులు వ్యతిరేకించినప్పటికీ… తెలంగాణవాదులు మాత్రం ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిందేనని గట్టిగా కోరుకున్నారు.
తెలుగుతల్లి విగ్రహానికి తెలంగాణకు సంబంధం లేదని… తెలంగాణ తల్లి ఉండాలంటూ అప్పట్లో ఒక వాదన ముందుకొచ్చింది. ఆ వాదనలో నుంచి రూపుదిద్దుకున్నదే ఇప్పటి దాకా తెలంగాణలో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహాలు.
ఉద్యమ కాలం నుంచి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఎరుపు రంగు చీర, ఆకుపచ్చ రవిక ధరించి తెలంగాణ తల్లి ఉంటుంది. నెత్తిన కిరీటం ఉంటుంది.
కొత్త రూపంతో తయారైన తెలంగాణ తల్లి (Telangana Talli) విగ్రహం
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ విగ్రహం విషయంలో ఏనాడు ఏ రాజకీయ పార్టీ కూడా అభ్యంతరాలు గానీ, సమర్థించడం గానీ ప్రత్యేకంగా జరగలేదు.
అయితే 2023 ఎన్నికల్లో అధికారానికి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపం విషయంలో తొలి సారిగా స్పందించింది.
ఉద్యమ కాలంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి ( Telangana Talli) విగ్రహం తెలంగాణలోని సగటు మహిళను పోలి ఉండటం లేదని… రాచరికానికి దర్పణంగా ఉందంటూ చెప్పింది. అందులో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక ప్రభుత్వం చెప్పిన తెలంగాణ తల్లి రూపంపై సస్పెన్స్ వీడింది.
ఈనెల 9న సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహం నమూనా బహిర్గతమైంది. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంది.
చేతిలో మొక్కజొన్న.. వరి సజ్జలు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు.
తెలంగాణలోని సగటు మహిళ రూపం అంటున్న సర్కార్.
తెలంగాణ సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లిని తీర్చిదిద్దినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జవహర్‌లాల్ నెహ్రూ ఫైనార్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ఈ చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది.
17 అడుగుల కాంస్య విగ్రహాన్ని సిద్ధం చేసింది. విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించారు. విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా.. కింద గద్దె మరో 3 అడుగులతో రూపొందించారు. ఇదంతా బాగానే ఉంది.
కానీ ప్రభుత్వం తెలంగాణ తల్లి ( Telangana Talli) రూపం మార్చడాన్ని తప్పుబడుతున్న బీఆర్ఎస్… ఉద్యమ కాలంలో రూపొందించిన రూపంతోనే మరో విగ్రహాన్ని డిసెంబర్ 9న మేడ్చెల్ జిల్లాలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
మొత్తం మీద తెలంగాణ సెంటిమెంట్ ను అధికార, ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి రూపంతో రాజకీయాలు చేస్తున్నాయి.
తెలంగాణ తల్లి రూపం విషయంలో రాజకీయాలు
వాదనలకు దిగుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు
తెలంగాణ ఉద్యమ కాలంలో తెరపైకి తెలంగాణ తల్లి
నాటి రూపంలో ఎరుపు చీర, ఆకుపచ్చ రవిక, కిరీటం
ఇంతకాలంలో అదే రూపంలో కొనసాగిన తెలంగాణ తల్లి
రూపం మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం
కొత్త రూపంతో తయారైన తెలంగాణ తల్లి విగ్రహం
కొత్త రూపంలో ఆకుపచ్చ చీర, ఎరుపు రంగు రవిక
కిరీటం, బతుకమ్మ లేకుండా కొత్త రూపం తయారీ
తెలంగాణలోని సగటు మహిళ రూపం అంటున్న సర్కార్
డిసెంబర్ 9న ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు
విపక్షాలను కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం
ప్రభుత్వ వాదనతో విభేదించిన ప్రతిపక్ష పార్టీలు
పోటీగా పాత విగ్రహాన్నే ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్
For More Content. Click Here.
Discussion about this post