మెట్రోరైలు డిపోకు అరుదైన అతిథి విచ్చేశారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా సందర్శించే నాగోల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌ని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం సందర్శించారు.
నటుడు రజనీకాంత్ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కేవీబీ రెడ్డి, ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారులు రజనీకాంత్‌కు సాదర స్వాగతం పలికారు. మెట్రోరైలు ఆపరేషన్స్‌కు గుండెకాయలాంటి ….ఓసీసీ గురించి రజినీ కాంత్ ఆసక్తిగా తెలుసుకున్నారు. షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆయనను ఓసీసీని సందర్శించాల్సిందిగా మెట్రోరైలు సంస్థ అభ్యర్థించగా నాగోల్‌కు వచ్చారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. మెట్రోలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించడంపై ఆయన అభినందించారు. ఎండీ కేవీబీరెడ్డి, సీవోవో సుధీర్ చిప్లూంకర్, సీఎస్‌వో మురళీవరదరాజన్లు హైదరాబాద్ మెట్రో, ఓసీసీ ప్రత్యేకతల గురించి రజినీకి వివరించారు. ప్రముఖ సెలబ్రిటీ తమ సంస్థను సందర్శించడం పట్ల కేవీబీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన సందర్శనను తమ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు.
Discussion about this post