ఏదైనా సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందినప్పుడు .. మనపై ఒత్తిడి పెరుగుతుంది .. దాన్ని అధిగమించక తప్పదని హీరో మహేష్ బాబు అభిప్రాయపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మహేష్ బాబు దంపతులు హాజరయ్యారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తండ్రి దివంగత నటుడు కృష్ణను గుర్తుచేసుకున్నారు.
నా సినిమాలు ప్రేక్షకాదరణ పొందనప్పుడు నిరుత్సాహ పడతాను. ఎందుకంటే ఒక సినిమాపై ఎన్నో అంచనాలుంటాయి. దాని వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. దాని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే తర్వాత సినిమాపై ఎక్కువ దృష్టి పెడతాను. మనం స్టార్ హీరో అయినప్పుడు ఒత్తిడిని అంగీకరించాలి…. ఈ విషయం నేను మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన చెప్పేవారు. క్రమశిక్షణ, వినయం.. వంటి వాటి ప్రాముఖ్యతను ఆయనే నేర్పించారు. విజయం ఒక్కసారిగా రాదని ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటేగానీ వరిస్తుందని చెప్పేవారు. ” అంటూ మహేష్ సూపర్ స్టార్ ని గుర్తుచేసుకున్నారు.
ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ లో నటిస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రానున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ఇందులో మహేశ్‌కు జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
దీని తర్వాత రాజమౌళితో మహేశ్ ఓ సినిమా చేయనున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది. ఈ సినిమా మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ గా నిలిచిపోవాలని ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి. మహేష్- జక్కన్న క్రేజీ కాంబినేషన్ కావడంతో సినీ ఇండస్ట్రీలో ఈ మూవీ హాట్ టాపిక్ అయింది. సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే భారీ అడ్వెంచరస్ డ్రామా మూవీగా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నారట రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Discussion about this post