పవన్ కు మోడీ బంపర్ ఆఫర్…. ఢిల్లీలో పవన్ బిజీ బిజీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. పలు అభివృద్ది పనుల గురించి వారితో చర్చించారు. పల్లెల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా నీరందించే జల్‌జీవన్ మిషన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం.
ప్రధాని మోదీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినతి
బృహత్తర లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని చెప్పారాయన. అయితే దాన్ని సమర్థంగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్రం నుంచి సహకారం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌తో కలిసి ఆయన ప్రధానిని కలిశారు. గ్రామీణ ప్రజలకు కుళాయి నీరందించే జల్‌జీవన్ మిషన్ పథకం అమలులోని సాధక బాధకాలను వివరించారు.
పవన్ కు మోడీ బంపర్ ఆఫర్….. డిప్యూటీ సీఎం విజన్
రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికీ కుళాయి నీరందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం కింద కేంద్ర 23 వేల కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం 2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వెల్లడించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి.
ఆ పనులు కూడా ప్రయోజనం లేకుండా నాసిరకంగా చేశారని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ పథకం ఆశయాలకు తగ్గట్టు కొత్తగా పనుల్ని మొదలు పెట్టేందుకు డీపీఆర్ తయారు చేసిందన్నారు.
పవన్ కు మోడీ బంపర్ ఆఫర్…. పవన్‌ను పార్లమెంటు ఆవరణ
గ్రామీణులందరికీ పైప్‌లైన్ ద్వారా రక్షిత నీరు అందించే ఈ బృహత్తర కార్యక్రమం అమలుకు అవసరమైన అదనపు నిధులను మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. వారిద్దరి భేటీ అరగంటకు పైగానే సాగింది.
అనంతరం పవన్‌ను పార్లమెంటు ఆవరణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలను కలిశారు.
అంతకు ముందు పవన్ కల్యాణ్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖల మంత్రి భూపేందర్‌యాదవ్‌తో సమావేశమయ్యారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియ పర్యవేక్షణ కోసం సింగిల్ విండో విధానం అమల్లోకి తేవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ-వేలంలో మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఎర్రచందనం ఏపీలో తప్ప ఎక్కడా దొరకదన్న పవన్… వాటిని స్మగ్లింగ్ చేసేటప్పుడు కర్ణాటకలో పట్టుకుంటే ఆ రాష్ట్ర అధికారులే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.
ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం తిరిగి తెప్పించుకొనే అధికారం మనకు ఉందని… అలాంటిది పక్క రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనాన్ని ఏపీకి రప్పించేందుకు అవసరమైన ఒప్పందాలు లేవన్నారు.
For More Pawan Kalyan Videos. Visit Here.
Discussion about this post