హైదరాబాద్ లోని అంబర్పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకలకు రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణలో దసరా, బతుకమ్మ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని అన్నారు. బతుకమ్మ సంబరాలలో ప్రతి మహిళ ఎంతో ఇష్టంగా పాల్గొంటారని అన్నారు. మహిళా పోలీసులు తమ ఆడపడుచులని చెప్పారు.
నిత్య విధులతో నిరంతరం బిజీగా ఉండే మహిళా పోలీసుల ఆనందం కోసం అంబర్పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈ వేడుకలను నిర్వహించారు. మహిళా పోలీసులకు చక్కటి పని వాతావరణాన్ని కల్పించడం మాత్రమే కాక వారి సంక్షేమానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నామని కమిషనర్ చౌహాన్ చెప్పారు. అహ్లాదకరమైన వాతావరణంలో పండుగలను జరుపుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు. ఈ వేడుకలలో డీసీపిలు శ్రీబాల, ఇందిరా మురళీధర్, అడిషనల్ డిసిపీలు శ్రీనివాస్ రెడ్డి, శ్యాంసుందర్, వెంకట్ రెడ్డి, అనొక్ జైన్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సి.హెచ్. భద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post