ప్రభుత్వ ఉద్యోగులూ జాగ్రత్త రెండో పెళ్లి ఆలోచన మానేయండి లేకపోతే మీ ఉద్యోగం పోతుంది. అదేంటి రెండో పెళ్ళి చేసుకుంటే ఉద్యోగం పోవడమేమిటి? ఇదెక్కడ విడ్డూరం. ఇది ఏ దేశంలో అంటారా. వేరే దేశంలో కాదు మనదేశంలోనే ఈ రూల్ వుంది. అది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి.
భాగస్వామి బతికి ఉండగా రెండోపెళ్ళి ఆలోచన వద్దంటోంది. అలా కాకుండా పెళ్ళి చేసుకోవాలని చూస్తే మాత్రం ఉద్యోగం పీకేస్తాం అని జీఓ కూడా జారీచేసారు. ఇలా అయితే కష్టమనుకున్నా తప్పదు. ఇది అన్ని మతాల వారికి వర్తిస్తుందని అందరు ఫాలో కావాల్సిందే అంటోంది అసోం ప్రభుత్వం. ముఖ్యంగా భార్య బతికి ఉండగా రెండో పెళ్ళి చేసుకుంటే శిక్ష తప్పదంటోంది. తమ రూల్ బుక్ 1965లోని రూల్ నెంబర్ 26 ప్రకారం మార్గదర్శకాలు జారీ చేసింది.
కొన్ని కారణాల వల్ల తప్పక రెండో పెళ్ళి చేసుకోవాల్సి వస్తే తప్పకుండా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. ప్రభుత్వ అనుమతి ఇచ్చిన తరువాతే రెండో పెళ్లి గురించి ఆలోచించాలి. అలా కాని పక్షంలో ఉద్యోగం పోవడమే కాదు శిక్షార్హులు అని కూడా తెలిపింది. భార్య చనిపోయిన పక్షంలో ఇటువంటి రూల్ వర్తించదు.
Discussion about this post