గదిలో పాఠాలు బోధించాల్సిన ఆ ఉపాధ్యాయుడు విద్యార్థిని(15)పై కన్నేసి ప్రేమ పేరుతో మోసగించాడు. బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆమెకు తాళి కట్టి పెళ్లైందని చెప్పి బలవంతంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది .ఇక వివరాలల్లోకి వెలితె
వాయిస్ ఓవర్ : భీమవరం గ్రామీణ మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు జిల్లాలోని మరో మండలంలోని ఒక పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని మాయమాటలు చెప్పి, అక్కడ చదువుతున్న ఒక విద్యార్థినిని ఈ నెల 19న ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని తన స్వగ్రామైన తాడేరుకు తీసుకెళ్లాడు. అక్కడే తాళి కట్టి పెళ్లైందని చెప్పి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు విధ్యాశాకఖ అధికారులు పురెళ్ల సోమరాజుని విధులనుండి సస్పెండ్ చేసామన్నారు .
Discussion about this post