స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ల పై హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ తీర్పుని రేపటికి వాయిదా వేసింది.. చంద్రబాబు ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయవాది లూధ్రా కోర్టును కోరారు. చంద్రబాబు 50 రోజులుగా జైలులో రిమాండ్ లో ఉన్న అంశాన్ని న్యాయవాదులు వివరించారు. అనారోగ్య సమస్యలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని కోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకువచ్చారు
వాయిస్
చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి ఇప్పటికి 52 రోజులు పూర్తయ్యింది. ఇప్పటి వరకుకూడా 17ఏ మీద ఫైట్ చేస్తున్న ఆయన లాయర్లు ఇప్పుడు ముందస్తు బెయిల్ అప్లై చేసారు.
హైకోర్టుకు దసరా సెలవులు కావడంతో…. పదే పదే బెయిల్ పిటిషన్లు వాయిదాలు పడ్డాయి. . వెకేషన్ బెంచ్ లో విచారణకు వచ్చినా న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పటంతో కేసు వాయిదా పడింది.
వాయిస్
ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా చంద్రబాబుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడంతో న్యాయమూర్తుల రోస్టర్ మారుస్తూ చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో క్వాష్ పిటిషన్లను జస్టిస్ శ్రీనివాసరెడ్డి, బెయిల్ పిటిషన్లను సురేష్ రెడ్డి విచారించేవారు. ఇప్పుడు రోస్టర్ మారడంతో క్వాష్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు రెండూ ఈ ఇద్దరు న్యాయమూర్తుల వద్దకు కాకుండా రోస్టర్లో వేరే కేసులను కేటాయించారు.
వాయిస్
హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేసారు. చంద్రబాబు ను అరెస్ట్ చేసిన తరువాత ఈ 52 రోజుల్లో కొత్తగా పురోగతి లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అదే సమయంలో కొత్తగా ఆరోపణలు కూడా లేవని వివరించారు. విచారణకు పూర్తిగా చంద్రబాబు సహకరిస్తారని న్యాయవాదులు కోర్టుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.అటు సుప్రీంలో క్వాష్ తీర్పు పైన ఆసక్తి నెలకొంది. వచ్చే నెల 8, 9 తేదీల్లో సుప్రీంలో చంద్రబాబుకు సంబంధించిన కీలక తీర్పులు వెలువడే అవకాశం ఉంది. దీంతో, రేపు హైకోర్టు బెయిల్ పైన తీర్పు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.
Discussion about this post