ఇండియన్ స్క్రీన్కు వెయ్యి కోట్ల మార్క్‌ను పరిచయం చేసిన ఘనత టాలీవుడ్‌దే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2తో ఇండియన్ మూవీ మార్కెట్ కొత్తశిఖరాలను అధిరోహించింది. ఈ సినిమా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. బాహుబలి సక్సెస్ తర్వాత అంతకు ముందే రిలీజ్ అయిన దంగల్ కూడా ఇతర దేశాల్లో రిలీజ్ అయి 2 వేల కోట్ల మార్క్‌ను రీచ్ రికార్డు ను సృష్టించింది. బాహుబలి 2తో వెయ్యి కోట్ల క్లబ్‌కు వెల్ కం చెప్పిన టాలీవుడ్, ఆ తరువాత రేసులో వెనుక బడింది. మళ్లీ రాజమౌళి దర్శకత్వంలోనే తెరకెక్కిన ట్రిపులార్ 1236 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఒక్క రాజమౌళి తప్ప మరే టాలీవుడ్ దర్శకుడు వెయ్యి కోట్ల రేంజ్లో బజ్ క్రియేట్ చేయలేకపోయారు.
బాలీవుడ్ మాత్రం ఈ విషయంలో ముందంజలోనే ఉంది. ఆలస్యంగా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా… ఈ ఏడాది రెండు వెయ్యి కోట్ల లతో సత్తా చాటింది నార్త్ ఇండస్ట్రీ. షారూఖ్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. స్పై యూనివర్స్‌లో భాగంగా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన “పఠాన్” షారూఖ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవటమే కాదు 10 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.రీసెంట్గా జవాన్ తో మరోసారి వెయ్యి కోట్ల మార్క్‌ను దాటి 1,146 కోట్లను టచ్ చేసింది బాలీవుడ్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్, పఠాన్ రికార్డులు బ్రేక్ చేయటమే కాదు షారూఖ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఒకే ఏడాదిలో రెండు సినిమాల ద్వారా 2 వేల కోట్లను సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరోగా చరిత్ర సృష్టించారు షారూఖ్ ఖాన్.
దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న టైగర్ 3 మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు నార్త్ మేకర్స్. అదే జరిగితే టాలీవుడ్ కన్నా బాలీవుడ్ చాలా ముందున్నట్టే అని చెప్పుకోవచ్చు. టైగర్ 3 లో సల్మాన్ ఖాన్ హీరో .. కత్రినా కైఫ్ హీరోయిన్ గా చేస్తుంది. నవంబర్ 12 ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. నవంబర్ 5 నుంచి అడ్వాన్స్ బుకింగ్ పారరంభం కానుంది.
అప్ కమింగ్ తెలుగు సినిమాల్లో వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసే రేంజ్ అంచనాలు ఉన్న సినిమాలు రెండే కనబడుతున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 ఒకటి .. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లుగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాల పై వెయ్యి కోట్ల ఆశలు పెట్టుకున్నారు. టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష నటించిన ‘భగవంత్ కేసరి వసూళ్లు అక్టోబర్ చివరి నాటికి 68 కోట్ల వరకు వచ్చాయి.
ఇక సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన జైలర్ అనూహ్య విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తం గా జైలర్ 606 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. హీరో విజయ్ నటించిన లియో అక్టోబర్ చివరినాటికి 540 కోట్ల మేరకు వసూలు చేసింది . జైలర్ వసూళ్ళను క్రాస్ చేయవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు . మొత్తం మీద చూస్తే ఇటీవల కాలంలో అటు నార్త్ ఇటు సౌత్ సినిమాలు సంచలన విజయాలు సాధించడమే కాకుండా వసూళ్ళలో దూసుకుపోతున్నాయి.
Discussion about this post