మెగాపవర్ స్టార్ రియల్ టైం.. గేమ్ చేంజర్ గా మారిపోతున్నాడు. టాలీవుడ్ లోని ఏ హీరో చేరలేని దారిలో దూసుకుపోతున్నాడు. ఎటు చూసినా చరణ్ చుట్టూ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టులే కనిపిస్తుండటం..చాలా మంది స్టార్లకు డైజెస్ట్ కావడం లేదు.
అభిమానులు మిస్టర్ బాక్సాఫీస్ గా పిలుచుకోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషన్ గామారుతున్నాడు. వరల్డ్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ సినిమాలు కంప్లీట్ కాక ముందే… క్రేజీ లైనప్ ను సెట్ చేసుకున్నాడు. ఇప్పటికే మగధీర ,ఆర్ ఆర్ ఆర్ మూవీలతో దర్శకధీరుడి రాజమౌళితో జతకట్టి… తన ఇమేజ్ పాన్ వరల్డ్ కి పెంచుకున్నాడు. ట్రిపులార్ సెట్స్ పై ఉండగానే సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ ను మొదలుపెట్టాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ వచ్చిన తర్వాత చరణ్ క్రేజ్ నెక్ట్స్ లెవల్ కి చేరింది. దీంతో ఆ క్రేజ్ రేంజ్ ను డబుల్ చేసుకునేలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సెన్సేషన్ గా మారుతున్నాడు. ఓ వైపు షూటింగ్ చేస్తుండగా క్రేజీ డైరెక్టర్లను లాక్ చేసుకోవడం తో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. మరోవైపు చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తెలిసి తోటి హీరోలు ఈర్ష్య పడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రజెంట్ శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న చరణ్… నెక్ట్స్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే సంచలనాలకు కేరాఫ్ గా మారుతోంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమారి హిరాణితో మూవీ అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగానే… ఇంకొందరు క్రేజీ డైరెక్టర్ లు లైన్ లో ఉన్నారని తెలిసి మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.
శంకర్, బుచ్చిబాబు సినిమాల తర్వాత కోలీవుడ్ డైరెక్టర్లతో మూవీలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట చరణ్. కేజీయఫ్ ఫ్రేం ప్రశాంత్ నీల్, బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూకుడుమీదున్న లోకేష్ కనకరాజ్ తో స్టోరీ డిస్కషన్స్ జరగుతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. మిగతా హీరోలు కనీసం వీరిలో ఒక్కరితో అయినా సినిమా చేయాలనుకుంటే.. చరణ్ మాత్రం ఇండియన్ టాప్ డైరెక్టర్స్ ను లైన్ లో పెట్టడం హాట్ టాపిక్ అయింది. మొత్తానికి మెగా పవర్ చిరుత వేగానికి ఇప్పట్లో బ్రేక్ లు వేయడం కష్టమనే చెప్పాలి. మిగిలిన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పుడొస్తాయో చూడాలి.
Discussion about this post