టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ తాజా హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ త్వరలో హిందీలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేస్తున్నారు. తన కెరీర్‌లో తొలిసారిగా హిందీలో బాలకృష్ణ స్వయంగా డబ్బింగ్ చెప్పిన సినిమా ఇది. హిందీ చిత్రం చూసిన తర్వాత హిందీ భాషపై నాకున్న పట్టు మీకు అర్థమవుతుంది,” అని బాలకృష్ణ అన్నారు. తన తండ్రి .. లెజెండరీ ఎన్టీఆర్ మాదిరిగానే కొత్త తరహా చిత్రాలను చేయడానికి తాను ఇష్టపడతానని బాలకృష్ణ మీడియాకు చెప్పారు. ‘భగవంత్ కేసరి’ సక్సెస్ మీట్‌లోబాలకృష్ణ మాట్లాడుతూ, “ నాన్నగారిలా ప్రయోగాలు చేయడం తనకు ఇష్టమే అన్నారు.
కేసరి లో పాత్ర తన వయసుకు తగిన పాత్ర అని .. “సాధారణంగా, నేను అలాంటి పాత్రలను అంగీకరించను, కానీ కథలో ఆడపిల్ల గురించి బలమైన సందేశం ఉంది. కొత్త సవాళ్లను స్వీకరించడం ఇష్టం కాబట్టి నేను చేయడానికి అంగీకరించాను” అని బాలకృష్ణ వివరించారు. తాను ఊహించినట్టే ఫలితాలు కూడా పాజిటివ్ గా ఉన్నాయన్నారు బాలయ్య.
ఈ రోజుల్లో ఉత్తర భారత ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టంగా మారింది. భగవంత్ కేసరి సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులను బాలకృష్ణ ఆకర్షించగలరా ? అనే చర్చ సినిమా వర్గాల్లో నడుస్తోంది. నిజంగా బాలయ్యకు ఇదొక సవాల్ అని చెప్పుకోవాలి.’భగవంత్ కేసరి’ త్వరలో ఉత్తర భారతదేశం అంతటా థియేటర్లలో విడుదల కానుంది. హిందీ సినిమా ప్రేక్షకులు రొటీన్ యాక్షన్ చిత్రాలను చూడటానికి ఇష్టపడరు.. అయితే ఈ చిత్రంలోఒక సందేశం ఉన్నందున అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ, నిర్మాతలు ముంబైలో సినిమాను ప్రమోట్ చేయాలి.. లేకుంటే మినిమమ్ ఓపెనింగ్స్ సాధించడం కూడా కష్టమవుతుంది” అని హిందీ డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ‘భగవంత్ కేసరి’ మూడు వారాల పాటు విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమైంది. మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 99 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. మిగిలిన రెండు వారాల్లో మరో 26 కోట్లు రాబట్టింది. గ్రాస్125 కోట్లు కాగా 69 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు.
























Discussion about this post