ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ ఒక్కొక్కరి ఒక్కోలా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ మామూలే. అయితే కొన్ని సందర్భాల్లో తప్పని సిట్యుయేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు సరైన హిట్టు ఒకటి పడితే చాలు ఇంకొనాల్లు తిరుగుండదు. ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నారు ఓ దర్శకుడు – హీరో – సంగీత దర్శకుడు.. ఈ ముగ్గురి టార్గెట్ మాత్రం ఒకే సినిమా… ఆ డీటేల్స్ ఏంటో చూద్దాం..
రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ చూశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో రామ్ కొత్త లుక్ లో ఫిదా చేశాడు. స్టార్టింగ్ లో రామ్ లుక్ చూసి ఇలా ఉన్నాటేండబ్బా అనుకున్నారు కానీ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పే తీరు, డాన్స్, క్యారెక్టర్లో ఇమిడి పోయిన తీరు చూసి ప్రేక్షకులు వహ్వా అనకుండా ఉండలేకపోయారు. టోటల్ గా కొత్త రామ్ ని పరిచయం చేశాడు పూరీ. నేను శైలజ హిట్ తర్వాత వరుస మూవీస్ లో నటించినా అవేమీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు..అలాంటి టైమ్ వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర మోత మోగించింది. అదే ఉత్సాహంలో రామ్…రెడ్, వారియర్, స్కంద మూవీస్ లో నటించాడు. ఈ మూడు కూడా నెగిటివ్ రిజల్ట్ ఇచ్చాయి. మళ్లీ ఎనర్జటిక్ హీరో ఈజ్ బ్యాక్ అనిపించాలంటే డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ తప్పనిసరి అనే చెప్పాలి
పూరి కూడా అరడజను డిజాస్టర్స్ తర్వాత సూపర్ హిట్ అందుకున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఆ తర్వాత అంతకుమించి అనిపించుకోవాలని లైగర్ తెరకెక్కించినా సీన్ మొత్తం రివర్సైంది. ఆ మూవీ భారీ డిజాస్టర్ అవడంతో పాటూ వివాదాలు చుట్టుముట్టాయి. దాన్నుంచి ఇప్పట్లో కోలుకోగలడా అనుకున్న టైమ్ లోనే డబుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. బాలీవుడ్ ను అట్రాక్ట్ చేసేందుకు సంజయ్ దత్ ను కూడా రంగంలోకి దింపాడు. పూరీకి పడడం లేవడం కొత్తేం కాదు కానీ ..డబుల్ ఇస్మార్ట్ తో హిట్ కొడితే మాత్రం పూరీ కొడితే గట్టిగానే కొడతాడని మరోసారి ప్రూవ్ చేసుకున్నట్టే.
ఇక డబుల్ ఇస్మార్ట్ హిట్ అవసరం పూరీ, రామ్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు ఉందనే చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కి రామ్ నటన, పూరీ దర్శకత్వంతో పాటూ..మణిశర్మ సాంగ్స్ కూడా ప్లస్ అయ్యాయి. అప్పటి వరకూ వరుస ఫ్లాపులతో ఉన్న మణిశర్మ ఈజ్ బ్యాక్ అనిపించింది ఆ మూవీ. మళ్లీ ఆ తర్వాత ఆ రేంజ్ లో పేరు తెచ్చిపెట్టిన మూవీ లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మళ్లీ కాస్త బిజీ అయినా మణిశర్మ ఆ తర్వాత సినిమాలతో వరుసగా నిరాశ పరుస్తూ వచ్చాడు..సో..మణిశర్మ ఆశలన్నీ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీపైనే అనే చెప్పాలి. మరి ముగ్గురి అంచనాలను డబుల్ ఇస్మార్ట్ నెరవేరుస్తుందా… వెయిట్ అండ్ సీ…
Discussion about this post