హనుమకొండ జిల్లా ముచ్చర్ల గ్రామ ప్రజలంతా దానకర్ణులు . అంటే వాళ్ళేదో డబ్బులు దానం చేయడం లేదు. అలా అని పొలాలు.. నగలు … ఉన్నవి ఊడ్చిపెట్టి ఇవ్వడం లేదు.. మరి వాళ్ళు చేసేది ఏంటంటారా … వాళ్ళు చేసే దానం అందరికీ ఆదర్శం… ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అదేంటో చెప్పచ్చుగా అంటారా చెబుతానండీ అంత తొందరైతే ఎలా.. వాచ్ దిస్ దెన్…
కొందరు అన్నదానం, భూదానం, గోదానం, రక్తదానం చేస్తుంటారు. ఎందుకంటే వీరు దానం చేసేది డబ్బులు లేక ఏవైనా వస్తువులో కాదు, వారు చేసేది నేత్రదానం. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ వారి మరణానంతరం నేత్రదానం చేస్తుంటారు.
సాధారణంగా ప్రజలు తమ తమ స్థితిగతులను బట్టి దానాలు చేస్తుంటారు. అది ఒక వ్యక్తి, కుటుంబం, లేదా సంస్థ వరకు మాత్రమే పరిమితం. కానీ ఒక మారుమూల గ్రామమైన ముచ్చెర్లలో ప్రతి ఒక్కరు ఇలా నేత్ర దానం చేసేందుకు ముందుకు రావడం కొంత ఆశ్చర్య పరిచే విషయమే.
ముచర్ల గ్రామానికి చెందిన రవీందర్ తన తల్లి మరణించిన తర్వాత ఆమె అవయవాలను దానం చేశాడు. మరణించిన తన తల్లి నేత్ర దానం చేసి మరొకరికి కంటిచూపునివ్వడంతో రవీందర్ హృదయం కరిగిపోయింది. దీంతో అవయవ దానంపై తన వంతుగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం ప్రారంభించాడు.
ముచ్చెర్ల గ్రామంలో నేత్ర దానం విషయంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి నేత్ర దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. అనంతరం పలువురు స్వచ్చంద సేవకులు సైతం నేత్ర దానంపై కల్పించిన అవగాహనతో గ్రామస్థుల్లో చైతన్యం కలిగింది. ప్రజలు స్వయంగా నేత్ర దానం చేసేందుకు ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారు.
మరణించిన అనంతరం మనిషి శరీరం మట్టిలో కలిసిపోతుంది. అలా చేయడంవల్ల ఎలాంటి ఉపయోగం లేదని కనీసం నేత్రదానం చేయడం వల్లనైనా చూపు లేని వారికి కంటిచూపు లభిస్తుందని నేత్రదాన దాతల వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. తాము ఇలా చేయడం వల్ల గర్వంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు అవయవ దానం చేస్తే తమ కుటుంబ సభ్యుల గుర్తుగా వేరొకరిలో వారిని చూసుకోవచ్చని దాతలు వ్యక్తం చేశారు .
Discussion about this post