మూలా నక్షతం నాడు సరస్వతిని పూజిస్తే. వాగ్దేవి మన నాలుకపై నర్తిస్తుంది…చదువుల తల్లి సరస్వతీదేవి కటాక్షం ఉంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం .. కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం ఎంతో విశేషమైనది. దసరా వేడుకల్లో మూలా నక్షత్రం రోజున భక్తులు తండోప తండాలుగా అమ్మను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తారు.
ఆ రోజున దుర్గమ్మ తల్లి సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. మహాకాళి, మహాలక్ష్మి , మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశంలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరించడమే మూలా నక్షత్రం రోజు చేసే అలంకారం ప్రత్యేకత.చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి , అంతరిక్ష మహా సరస్వతులుగా సప్తనామాలతో వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయినిగా విరాజిల్లుతుంది.
అమ్మను బ్రహ్మ చైతన్య నవరూపిణిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేతాపద్మాన్ని ఆసనంగా అధిష్టించి వీణ , దండ , కమండలం , అక్షమాల ధరించి నెమలితో కూడి అభయముద్ర ధరించి భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది.వ్యాసుడు , వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర ప్రముఖులకు వాక్ వైభవం ఇచ్చింది . దేవిని కొలిస్తే విద్యార్థులకు బుద్ధి వికాసం కలుగుతుంది. సంగీత, సాహిత్యా లకు అదిష్టానదేవత. సకల జీవుల నాలుక పై సరస్వతి నివాసం ఉంటుంది.voice త్రిశక్తి స్వరూపాల్లో మూడవ శక్తి రూపం సరస్వతీదేవి అమ్మవారు. దేవీ నవరాత్రుల 9 రోజులలో అమ్మవారిని 9 అలంకారాలతో పూజిస్తారు.ఇందులో ప్రత్యేకంగా చేసేపూజలలో కుమారీ పూజ, శమీ పూజ, ఆయుధ పూజ, సరస్వతీ పూజ ముఖ్యమైనవి. వీలైన వారు గుడిలో, దేవీమంటపాలలో, లేదా ఇంట్లో సరస్వతీ పటం ఉంచి పూజించ వచ్చు.
సరస్వతీ పూజకి తెల్లని పూలు వాడాలి. చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే తెల్ల వస్త్రాలు, లేదా పట్టుబట్టలు ధరించాలి. అమ్మవారిముందు తాము చదువుకునే పుస్తకాలుపెన్నులు ఉంచి, అమ్మవారితో పాటు ఆయా పుస్తకాలను కూడా పూజించాలి. క్షీరాన్నం, పాలు, బెల్లం వంటి పదార్థాలు కలిపి నైవేద్యంగా నివేదించాలి. చలిమిడి,వడపప్పు పానకం వంటివి ప్రత్యేక నైవేద్యాలు కూడా పెట్టవచ్చు.
























Discussion about this post