Medaram Earthquake: వణికిన సమ్మక్క-సారక్క గద్దెలు.. ఊగిన ఇనుప గ్రిల్స్.. సీసీ కెమెరాలకు చిక్కిన వీడియో
రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది.
భూమికి 40 కి.మీ లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. భూకంప కేంద్రం ఎక్కువ లోతులో ఉన్నందున ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు.
మేడారం( Medaram Earthquake) సమీప ప్రాంతంలో
1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సుమారు 50 ఏళ్ల తర్వాత నేడు ఆ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు.
భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థాన చలనం జరిగి ప్రకంపనలు వస్తుంటాయని తెలిపారు.హైదరాబాద్, భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాలు జోన్-3లో ఉన్నాయన్నారు.
జోన్-5లో ఉన్న ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం గుర్తింపు
అయితే మేడారంలో భూకంప ( Medaram Earthquake) కేంద్రం గుర్తించిన నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై స్థానికులు చర్చించు కుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు 31న మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు టోర్నడో తరహాలో బలమైన ఈదురు గాలులు వీచాయి.
సుమారు 50 వేల చెట్లు నేలకూలాయి. ఏటూరు నాగారం నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ నష్టం జరిగింది.
ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించడంతో ఆ ఘటనతో దీనికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో చర్చ జరుగుతోంది. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు, భూ ప్రకంపనలకు సంబంధం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ములుగు జిల్లా మేడారం అటవీప్రాంతం నడిబొడ్డున సంభవించిన భూకంపం కలకలం రేపింది. సెప్టెంబర్ 4న ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో పెనుమార్పులు సంభవించిన సంగతి తెలిసిందే. సుడిగాలి 50,000 నుండి 70,000 చెట్లను నేలకూల్చింది.
సుడిగాలి ఎంత బలంగా ఉంది? చెట్లు ఎండిపోయినట్లు రెండు వైపులా వంగి ఉన్నాయి. కొన్ని చెట్లు, కానీ చీలిపోయాయి… మరికొన్ని వేళ్లతో పెకిలించబడ్డాయి. దేశంలోనే అత్యంత అరుదైన ఘటనగా సెప్టెంబర్ 4న జరిగిన ఘటనను అటవీ శాఖ అధికారులు ముగించారు.
అనంతరం అటవీ శాఖ అధికారులు విచారణ చేసేందుకు నిపుణులను కూడా స్థలానికి పంపుతామని ప్రకటించారు. తాజాగా బుధవారం కూడా ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు భూకంప శాస్త్ర విభాగం ధృవీకరించింది.
మేడారంలో(Medaram Earthquake) గాలి దుమారం రేపిన ఘటన జరిగి సరిగ్గా మూడోరోజు భూకంపం రావడంతో ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ మొదటి వారంలో మేడారం అడవుల్లో ప్రకృతి వైపరీత్యం సంభవించగా డిసెంబర్ 4న భూకంపం సంభవించడం గమనార్హం.
For More News Updates. Click Here.
Discussion about this post