మనతోపాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటేనే అవార్డులు వస్తాయని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్న టాలీవుడ్ ప్రముఖులకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో బన్నీ ఎమోషనల్ గా మాట్లాడారు.
మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటేనే ఏదైనా జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా… కానీ, నాకు అవార్డు రావాలని సుకుమార్ ఎంతగానో కోరుకున్నారు… అందుకే ఈ అవార్డు వచ్చింది. సుకుమారే అచీవర్.. నేను కేవలం అచీవ్ మెంట్ మాత్రమే అని అల్లు అర్జున్ చెప్పారు.
బాలీవుడ్ కు వెళ్లమని దేవిశ్రీ ప్రసాద్ కి 20 ఏళ్లలో ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు.. ‘ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు నేనూ వచ్చేస్తా’ అనేవాడు… అతడి మాటలు విని.. మనకెక్కడ ఆవుతుందిలే అనుకునేవాడిని. అలాంటిది మేమిద్దరం ఒకేసారి ‘పుష్ప’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం… అక్కడా మంచి విజయాన్ని అందుకున్నాం… అని చెప్పారు.
జాతీయ అవార్డులకు మా ఇద్దరి పేర్లు ప్రకటించిన రోజు నాన్న ఎంతో ఆనందించారు. ‘ప్రిన్సిపాళ్ళ దగ్గర టీసీలు తీసుకునే మేం.. ప్రెసిడెంట్ దగ్గర మెడల్స్ తీసుకుంటామని అనుకున్నావా? ” అని నాన్నని అడిగానని బన్నీ చెప్పారు. పార్టీలో అల్లు అర్జున్ కేక్ కట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ లైవ్ పాటలతో అదరగొట్టారు. ఈ పార్టీ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Discussion about this post