పెళ్ళి చేస్తే కానీ దారిలో పడడు అనగానే ఉద్యోగం సద్యోగం లేదు ఏం పెట్టి పోషిస్తాడు పెళ్ళాన్ని అనే మాట మనం రెగ్యులర్గా వింటూ వుంటాం. ఇలాంటి వారికి ఓ శుభవార్త. మీరు పెళ్ళి చేసుకుంటే ఉద్యోగం ఇస్తానంటోంది ఓ ప్రభుత్వం. ఆ ప్రభుత్వమేదో మీరే చూడండి ఈ స్టోరీ లో
నిరుద్యోగులకు పెళ్ళిళ్ళు అవడం చాలా కష్టం. పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రారు. అబ్బాయిలు కూడ ఉద్యోగం చేసే అమ్మాయినే కోరుకుంటున్నారు. ఎంత వయసు వచ్చినా కూడా సరియైన ఉద్యోగం వచ్చే దాకా వేచి చూస్తున్నారు. ఉద్యోగస్తులకే పెళ్ళిళ్ళు కూడా. ఉత్తర్ ప్రదేశ్ మాత్రం పెళ్ళి చేసుకోండి. ఉద్యోగం పొందండి అంటూ విచిత్రమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేద కుటుంబాలకు చెందిన యువతీ యువకుల వివాహాల కోసం మాస్ మ్యారేజ్ స్కీం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పెళ్లి చేయడమే కాకుండా వారి అర్హతలను బట్టి ఉద్యోగాలను కల్పించనుందని ఆ రాష్ట్ర మంత్రి దయాశంకర్ సింగ్ ప్రకటించారు.
మంత్రి ప్రకటనతో రానున్న రోజుల్లో ఈ పథకం కింద పెళ్ళిళ్ళు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. . పెళ్ళి చేసుకుందాం ఉద్యోగం ప్రభుత్వం ఇస్తుందిలే అనుకుంటే కాదు. మాస్ మ్యారేజ్ స్కీంలో చేరిన వారికి మాత్రమే పెళ్లి చేసి ఉద్యోగం ఇస్తారట. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగం వుంటేనే పెళ్ళి అనే మాట ఇక వుండదన్నమాట …ఈ స్కీం ఏదో బాగుంది..దేశవ్యాప్తం గా ప్రవేశపెడితే బాగుంటుంది.
Discussion about this post