2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో సొంత నియోజకవర్గం అమేథీ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ముందు జాగ్రత్తగా కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి అక్కడ రాహుల్ గాంధీ విజయం సాధించారు. అమేధీలో గెలుపు పై అనుమానం రాబట్టే అప్పట్లో వయనాడ్ లో కూడా నామినేషన్ వేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో మరల అమేథీ నుంచి తానే బరిలోకి దిగుతారా? లేదా ?అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్ సోదరి ప్రియాంక ను బరిలోకి దింపవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది.
ఇక అమేధీ గురించి చెప్పుకోవాలంటే … కాంగ్రెస్ కు బాగా పట్టున్న లోకసభ నియోజక వర్గం… ఈ లోకసభ స్థానం ఉత్తరప్రదేశ లో ఉంది ..1967 నుంచి అక్కడ కాంగ్రెస్ నేతలు గెలిచారు. మధ్యలో 1977 ….. 1998 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నేతలు అక్కడ ఓటమి పాలయ్యారు.. ఇందిరాగాంధీ కుమారులు సంజయ్ గాంధీ ఒకసారి ,, రాజీవ్ గాంధీ నాలుగు సార్లు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. 1999 లో రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేసి విజయం సాధించారు. 2004 లో రాహుల్ రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచే మొదలైంది.రాహుల్ 2014 వరకు ఇక్కడ నుంచే పోటీ చేసే వరుస విజయాలు సాధించారు. హ్యాట్రిక్ కొట్టారు. 2019 లో మాత్రం అనూహ్యంగా రాహుల్ ఓడిపోయారు.
నాటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ కి 413394 ఓట్లు వచ్చాయి..ఆయన పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ కి 468514 ఓట్లు వచ్చాయి. 55120 ఓట్ల ఆధిక్యతతో స్మృతి ఇరానీ విజయం సాధించారు. 2014 లో కూడా స్మృతి ఇరానీ ఇక్కడ నుంచే పోటీ చేసి 3 లక్షల ఓట్లు రాబట్టారు. రెండో సారి పోటీ చేసి గెలిచి మోడీ మంత్రివర్గం లో మంత్రి అయ్యారు. ఈ క్రమంలో ఈ సారి కూడా స్మృతి ఇరానీ అమేధీ నుంచే పోటీ చేస్తారు.రాహుల్ ని ఇక్కడనుంచి పోటీ చేయమని యూపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు.
వయనాడ్ నియోజకవర్గం కేరళలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కి మంచి పట్టు ఉన్న లోకసభ స్థానం. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడ పోటీ చేసి 4,31,770 ఓట్ల ఆధిక్యతతో సీపీఐ అభ్యర్థి పై ఘన విజయం సాధించారు. 2014 లో ఇక్కడ పోటీచేసి 80 వేల ఓట్లు సాధించిన బీజేపీ 2019 లో పోటీ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో .. వేచి చూడాలి. రాహుల్ కి ఇది సురక్షిత నియోజకవర్గం కాబట్టి దీన్నే ఎంచుకోవచ్చు.అంటున్నారు. అమేధీ లో ప్రియాంక పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రియాంకను వారణాసి లో ప్రధాని నరేంద్ర మోడీ పై పోటీ చేయమని యూపీ నేతలు అడుగుతున్నారు.
Discussion about this post