ఏ సినిమా హిట్ అవుతుందో ?ఫట్ అవుతుందో ముందే ఎవరూ చెప్పలేరు.సూపర్ హిట్ అవుతుందన్న సినిమా ప్లాప్ కావచ్చు.బాగా ఆడదేమో అనుకున్న సినిమా గొప్ప హిట్ కావచ్చు. ప్రస్తుత తరుణంలో కొత్త కథలు రాసి ప్రేక్షకులను మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. అందుకే పాత కథలను మళ్లీ కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు బాలీవుడ్ దర్శకులు.
చాలామంది దర్శకులు ముఖ్యంగా మనకు తెలియని చరిత్రను తవ్వి తీస్తున్నారు.ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్ దేశాల మధ్య దశాబ్దాల కింద జరిగిన చరిత్రను ఇప్పుడు వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. వాటికి ఆదరణ కూడా బాగానే ఉండడంతోఅలాంటి కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు హీరోలు కూడా.
తాజాగా పిప్పా అనే ట్రైలర్ విడుదలైంది. ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాగూర్ ఇందులో జంటగా నటిస్తున్నారు. ఎయిర్ లిఫ్ట్ లాంటి అద్భుతమైన తెరకెక్కించిన రాజా కృష్ణ మీనన్ దీనికి దర్శకుడు. నవంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల కానుంది ఈసినిమా. ప్రస్తుత బంగ్లాదేశ్, ఒకప్పటి ఈస్ట్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఈ తెరకెక్కింది. 1971 ఇండోపాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది.
అలాగే ఐబి 71 కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలోనే వచ్చింది. ఇది కూడా బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ అటాక్స్ నుంచి ఇండియా ఎలా కాపాడింది అన్నకథాంశంతో పాటు ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాకింగ్ ఘటన ఆధారంగా కథ తయారుచేసుకున్నారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి.
నటుడు విక్కీ కౌశల్ కూడా వరుసగా హిస్టరీ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన శామ్ బహుదూర్ డిసెంబర్ 1న విడుదల కానుంది. రెండు సంవత్సరాల కింద సర్దార్ ఉధామ్ చేశాడు. జలియన్ వాలాబాగ్ నేపథ్యంలో సాగే కథ అది.దీనికి అప్పట్లో మంచి స్పందన వచ్చింది. అలాగే ఇండియా పాకిస్తాన్ అటాక్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన URI లో ఈయన హీరోగా నటించాడు.
ఇలా ఒకటేమిటి హిస్టరీ బ్యాక్ డ్రాప్ లు చాలానే వస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు డిమాండ్ బాగా ఉంది. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
Discussion about this post