ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సమర శంఖం పూరిస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం జిల్లాలలో గురువారం సామాజిక సాధికారత బస్సు యాత్రలను ప్రారంభించింది. ఇచ్చాపురం, తెనాలి, సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రంలలో భారీ బహిరంగ సభలను నిర్వహించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు 175 స్థానాలు సాధించే లక్ష్యంతో పార్టీ రూపొందించిన కార్యాచరణలో భాగంగా బస్సు యాత్రలు జరుగుతున్నాయి
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారీగా జరిగిన వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రలకు, బహిరంగ సభలకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సభలలో మంత్రులు, పార్టీ అగ్ర నేతలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్నిలెక్కలతో సహా వివరించారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆ వర్గాలకు ద్రోహం చేశారని వివరించారు.
ఇచ్ఛాపురంలో నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఈ యాత్రలకు నేతృత్వం వహించారు. ఇచ్చాపురం, తెనాలి, శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో బహిరంగ సభలు జరిగాయి. మూడు ప్రాంతాల్లోను బస్సుయాత్ర, సభలకు ప్రజలు పోటెత్తారు. రెండు నెలల పాటు బస్సు యాత్ర, సభలు కొనసాగనున్నాయి.
























Discussion about this post