టాలీవుడ్ లో ప్రస్తుతం యమ బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీలీలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో ఆమె నటనకు అన్ని వర్గాలు కితాబు ఇస్తున్నాయి. ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఆమె హీరోయిన్ గా నటించగా భగవంత్ కేసరిలో మాత్రం కూతురి పాత్రను పోషించారు. నటనతో పాటు డాన్స్ కూడా అద్భుతంగా చేసిందని దాదాపు అన్ని రివ్యూలలో ను మార్కులు కొట్టేసింది. విజ్జీ పాప పాత్రలో ప్రేక్షకులను అలరించిందని వెబ్ సైట్ల రివ్యూలలో అభినందనలు అందుకుంది.
శ్రీలీల ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. చాలా సినిమాలు చేస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను బానే ఫాలో అవుతోంది. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. కెరీర్ మొదట్లో సినిమాకు ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీలీల ప్రస్తుతం కోటిన్నరపైనే డిమాండ్ చేస్తోందిట. భగవంత్ కేసరిలో చేసినందుకు కోటీ 80 లక్షలు తీసుకుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది కాజల్ తీసుకున్న రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువని చెవులు కొరుక్కుంటున్నాయి.
Discussion about this post