తెలంగాణ ఉద్యమ సారథి.. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు.. అలియాస్ భారత రాష్ట్ర సమితి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ముహూర్తం చూసుకోకుండా కాలు కూడా బయట పెట్టరు. ఆధ్యాత్మికతతో పాటు .. కొన్ని సెంటిమెంట్లనూ కేసీఆర్ ఫాలో అవుతారు. సాధారణంగా రాజకీయ నేతలకు కొన్ని విషయాల్లో సెంటిమెంట్లు ఉంటాయి. ఇక ఎన్నికల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని హుస్నాబాద్ నుంచి ప్రారంభించి అధికారంలోకి వచ్చారు. దీంతో ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి సమరశంఖం పూరించాలని నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ కు హుస్నాబాద్ సెంటిమెంట్గా మారిపోయింది. 2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించారు. ఇందులో భాగంగానే.. అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయాలని ముహూర్తం పెట్టుకున్నారు.
2014, 2018 ఎన్నికల్లో హుస్నాబాద్లో మొదలు పెట్టిన ప్రచారం నాటి టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది. వరుసగా 63, 88 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈసారి పార్టీ పేరు మారింది. అయినా కేసీఆర్ మాత్రం ఈసారి కూడా హుస్నాబాద్ సెంటిమెంట్ కలిసి వస్తుందని భావిస్తున్నారు. మరి పేరుమారిన పార్టీ ని ఈసారి కూడా సెంటి మెంటు గెలిపిస్తుందా లేదా LETS WAIT AND SEE.
Discussion about this post