జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా దూసుకుపోతున్నారు .. ఇప్పటికే పొత్తు ప్రకటన చేసి .. రాజకీయంగా తన అడుగులపై క్లారిటీ ఇచ్చిన పవన్ … తాజాగా నాలుగో విడత వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి వారాహి యాత్ర మొదలయింది . ఇక టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత తొలిసారి ప్రజల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కి భారీ స్వాగతం లభిస్తుంది .. ప్రజల నుంచి పవన్ అఖండ ఆదరణ అందుకుంటున్నారు . అంతేకాక పవన్ కొత్తరకం ప్రసంగాలతో ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోతున్నారు . అలాగే రాజకీయంగా కూడా సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు ..
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అవన్ కళ్యాణ్ .. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.అలాగే పవన్ ద్వారా ఏపీలో బలోపేతం కావాలని బిజెపి కూడా ప్రయత్నించింది. అదే సమయంలో జనసేన ను బిజెపిలో విలీనం చేస్తారనే వార్తలు వావ్హహాయి . అయినా సరే పవన్ ఎక్కడా తాగగలేదు . ప్రజల్లో తన పట్ల నమ్మకం పెంచుకునేలా అడుగులు వెచ్చారు. బిజెపి కేంద్ర నాయకత్వం వైసీపీ అధినేత జగన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తుంది .. ఏపీలో పవన్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నా … జగన్ తో సానుకూలంగా ఉంది .. ఎన్నికలు సమీపిస్తున్నా పవన్ కంటే ఎక్కువగా జగన్ ని ఆదరిస్తుంది .. దీంతో ఎన్డీఏ నుంచి పవన్ బయటకు వచ్చేశారు . రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సహాయం అవసరం. అందుకే తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిగా వెళ్తే కేంద్ర ఆశీస్సులు ఉంటాయని పవన్ భావించారు. కానీ బిజెపి ఆలా ఆలోచించడం లేదు. వైసీపీకి అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తోంది.
తెలుగుదేశం పార్టీని జగన్ ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో బిజెపి నాయకత్వానికి పవన్ ఝలక్ ఇచ్చారు . ఎన్డీఏకు గుడ్ బై చెప్పనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళుతున్న పవన్.. తెలంగాణలో మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు.. ఏపీ సరిహద్దు జిల్లాలతో పాటు.. సెటిలర్స్ అధికంగా ఉండే హైదరాబాద్ లో ఉన్నా నియోజకవర్గాల్లో పవన్ పోటీకి రెడీ అయ్యారు .. గత ఎన్నికల ముంగిట కెసిఆర్.. జగన్ కు సహకారం అందించారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకుండా పవన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. . అటు తెలంగాణలో జనసేన అభ్యర్థుల ప్రకటన, ఇటు పవన్ బిజెపితో కటీఫ్ ప్రకటన . పవన్ వ్యూహం లో భాగంగానే చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి .
ఇదే సమయంలో జనసేన-టీడీపీ ఇండియా కూటమిలోకి చేరుతాయనిప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ బలహీనంగా ఉంది. కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే.. ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. తాజాగా టిడిపి, జనసేన చేరితే ఇండియా కూటమి బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకు దగ్గర కావాలనుకున్నా బిజెపి ఆసక్తి చూపలేదు. ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం ఎన్డీఏలో చేరేందుకు మొగ్గు చూపడం లేదు. అటు చంద్రబాబును ఇండియా కూటమిలోకి తీసుకెళ్లాలని వామపక్షాలు భావిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో జరిగిన పరిణామాల క్రమంలో చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఇప్పుడు పవన్ టిడిపి తో పొత్తు ప్రకటన, అటు ఎన్డీఏ కి గుడ్ బై చెప్పడం వంటి కారణాలతో నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయ్యింది.
ఏపీలో బిజెపి కంటే వామపక్షాలే శ్రేయస్కరమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. తాజాగా వెల్లడైన ఒక సర్వేలో టిడిపి, జనసేన కూటమితో వామపక్షాలు కలిస్తే అద్భుత విజయం దక్కుతుందని తేలింది. అదే బిజెపితో అయితే వైసీపీకి అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చింది. దీంతో టిడిపి, జనసేన పునరాలోచనలో పడ్డాయి. వామపక్షాల వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వామపక్షాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఇండియా కూటమి వైపు టిడిపి, జనసేన వెళ్లాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో జనసేన వామపక్షాలతో కలిసి పని చేసింది. పవన్ భావజాలానికి, వామపక్ష భావజాలానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. అటు తెలుగుదేశం పార్టీ సైతం పలు సందర్భాల్లో వామపక్షాలతో కలిసి పని చేసింది. మంచి విజయాలను దక్కించుకుంది. అందుకే మూడు పార్టీల కలయిక చాలా సులువు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే పవన్ వ్యూహాత్మక అడుగులు వేస్తూ .. రాష్ట్ర , జాతీయ రాజకీయాల్లో జనసేన పట్టు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టం అవుతుంది ..
Discussion about this post