తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి ముచ్చటగా మూడవ సారి తెలంగాణాకు ప్రధాని నరేంధ్ర మోడీ రానున్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి
ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి ప్రధాని తెలంగాణలో ఎన్నికల పర్యటనకు సర్వం సిద్ధం చేసింది.ఈ నెల 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. 26న తూప్రాన్, నిర్మల్ సభల్లో పాల్గొని , మరుసటి రోజు 27న మహబూబాబాద్, కరీంనగర్ ప్రచార సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే రోడ్‌షోకు హాజరవుతారు. ప్రచార సభల్లో మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ వేదికలో జరిగిన మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. వర్గీకరణ బిల్లుకు మద్దతు ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి బీజేపీ జెండా ఎగురవేయాలని కమలనాథులు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రధాని మోదీ సభ శ్రేణులకు మంచి బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. పలుమార్లు తెలంగాణలో పర్యటిస్తూ సభలు రోడ్ షో ల తో పాటు శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు.
























Discussion about this post