సూపర్ 8కి జింబాబ్వే.. టీ20 వరల్డ్‌కప్ నుంచి ఆస్ట్రేలియా ఎలిమినేట్! క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా జట్టు ఎలిమినేట్ అయింది. జింబాబ్వే జట్టు సూపర్ – 8కి అర్హత సాధించింది. పల్లెకెలె వేదికగా ఐర్లాండ్ – జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరొక పాయింట్ ప్రకటించారు. దాంతో ఐదు పాయింట్లతో ఉన్న జింబాబ్వే జట్టు నేరుగా సూపర్ 8కి అర్హత సాధించింది. దాంతో ఆస్ట్రేలియా ఇంటిబాట పట్టాల్సి వచ్చింది.

  • వర్షం కారణంగా జింబాబ్వే – ఐర్లాండ్ మ్యాచ్ రద్దు
  • ఐదు పాయింట్లతో సూపర్ 8కి అర్హత సాధించిన జింబాబ్వే
  • ఈ టోర్నీ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయిన ఆసీస్

అందరూ అనుకున్నట్టే జరిగింది.. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ నుంచి ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది. మ్యాచ్ ఆడకుండానే జింబాబ్వే సూపర్ 8కి క్వాలిఫై అవడం విశేషం.

పల్లెకెలె వేదికగా ఐర్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు. దాంతో జింబాబ్వే నేరుగా సూపర్ 8కి అర్హత సాధించినట్టయింది. వర్షం తగ్గితే కనీసం పది ఓవర్లు అయినా మ్యాచ్ నిర్వహించాలని ఐసీసీ ప్రయత్నం చేసింది. కానీ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటం సాధ్యం కాలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో గ్రూప్ స్థాయి నుంచే ఆస్ట్రేలియా జట్టు ఎలిమినేట్ అవడం ఇదే తొలిసారి. సీనియర్ ప్లేయర్లు ఈ టోర్నీకి ముందు గాయాల కారణంగా దూరమవ్వడం.. ఉన్న ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడంతో ఆస్ట్రేలియా జట్టు వరుసగా జింబాబ్వే, శ్రీలంకలపై ఓటమిలను మూటగట్టుకుంది.

2007లో తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే, మళ్లీ 2026లోనూ ఓడించడం విశేషం. ఆసీస్-జింబాబ్వే మధ్య టీ20 వరల్డ్‌కప్‌లో రెండు మ్యాచ్‌లు జరిగితే రెండిటింటోనూ జింబాబ్వేదే పైచేయిగా నిలిచింది.

గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, జింబాబ్వే చెరొక మ్యాచ్‌లు మిగిలుండగానే.. సూపర్ 8, ఎలిమినేషన్ లిస్ట్ రెడీ అయిపోయింది. ఈ టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టిన జింబాబ్వే జట్టు తొలి మ్యాచ్‌లో ఒమన్ మీద విజయం సాధించగా..

కీలకమైన ఆస్ట్రేలియాపై కూడా ఘన విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ ఐర్లాండ్‌తో జరగాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది. ఇక జింబాబ్వే గ్రూప్ స్టేజ్‌లో తన చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 19వ తేదీన శ్రీలంకతో ఆడనుంది.

సూపర్ 8 లిస్ట్ ఇదే

సూపర్ 8లో ఆడే అన్ని జట్ల జాబితా దాదాపు ఖరారయింది. ఒక్క గ్రూప్ ఏ మినహా మిగతా గ్రూప్‌లలో సూపర్ 8కి ఆడే జట్లు ఖరారయ్యాయి. గ్రూప్ ఏ నుంచి భారత్ అర్హత సాధించగా.. రెండో టీమ్ ఇంకా ఖరారు కాలేదు.

గ్రూప్ బీ నుంచి శ్రీలంక, జింబాబ్వే క్వాలిఫై అవ్వగా.. గ్రూప్ సీ నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ వెళ్లాయి. గ్రూప్ డీ నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఎంట్రీ ఇచ్చాయి.

Follows us for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top