రూ.41.60 కోట్ల ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’
గత ప్రభుత్వంలా మొక్కుబడి సాయం కాదు.. మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్‌గా ఎదిగేలా సాయం చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అర్హత కలిగిన పేద విద్యార్థులు ధైర్యంగా విదేశాల్లో ఉన్నత విద్య చదివేలా ‘జగనన్న విదేశీ విద్య’ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. 408 మంది విద్యార్థులకు రూ. 107 కోట్లను ఈ పథకం ద్వారా విడుదల చేశామన్నారు. ఈ ఏడాది 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయని, రూ.9.50 కోట్లు వారికి ఇస్తున్నామన్నారు.
విదేశాల్లో ఇప్పటికే చదువుతున్న పిల్లలకు ఈ సీజన్లో ఫీజులు చెల్లించాల్సిన మొత్తం రూ.41.59 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.1లక్ష ప్రోత్సాహకం, మెయిన్స్ పాస్ అయితే రూ.1లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. 95 మంది విద్యార్థులు ప్రిలీమ్స్కు చేరారని, వీరిలో 11 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారని, వీరికి ఈరోజు ప్రోత్సాహం అందజేశామన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం, జగనన్న తోడుగా ఉంటుందన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
Discussion about this post