మంగళవారం రాత్రి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నాయకులతో జరిగిన సమావేశం తరువాత ఇండియా కూటమి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు ఎంపీ రాహుల్ గాంధీని నియమించింది.
గత రెండు సెషన్లలో పార్లమెంటుకు ప్రతిపక్ష నాయకుడు లేరు ఎందుకంటే ఏ ప్రతిపక్ష పార్టీలోనూ మొత్తం లోక్‌సభ బలంలో పదవ వంతుకు సమానమైన సభ్యులు లేరు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోగా, 2019లో 52 సీట్లు గెలుచుకుంది.కానీ ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలు గెలుచుకుంది.
జూన్ 8న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని నియమిస్తూ పెట్టిన తీర్మానాన్ని ఆ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది.పార్టీకి సరిపోయే సంఖ్యాబలం ఉన్నందున ప్రతిపక్ష నాయకుడి పదవిని అంగీకరించాలని రాహుల్‌ను కోరింది. బుధవారం నాడు, రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా లోక్‌సభ స్పీకర్ ఆమోదించినట్లు పార్లమెంట్ నుండి అధికారిక నోటిఫికేషన్ వెలువడింది.
తన నియామకంపై ఒక పోస్ట్‌లో, రాహుల్ గాంధీ ఖర్గే మరియు కాంగ్రెస్ యొక్క కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మేము పార్లమెంటులో ప్రతి భారతీయుడి గొంతుని లేవనెత్తుతాము, మన రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము ” అని ఆయన X లో తెలిపారు.
1977లో ప్రతిపక్ష నాయకుల జీతాలు మరియు భత్యాల పార్లమెంటు చట్టం ద్వారా ఈ పోస్ట్ అధికారికంగా అమలులోకి వచ్చింది.
లోక్‌సభలో అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉన్న ప్రతిపక్ష పార్టీచే ఎన్నుకోబడిన నాయకుడికి ఈ పదవి లభిస్తుంది . సభలో ప్రతిపక్షం యొక్క గొంతు వినిపించడం దీని ప్రధాన విధి.
2012 నాటి పార్లమెంట్ అధికారిక పత్రాల ప్రకారం లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి తో సమానంగా పరిగణింపబడతారు . ప్రభుత్వం రాజీనామా చేసినా లేదా సభలో బాల నిరూపణ లో విఫలమైనా తదుపరి పరిపాలనను చేపట్టడానికి పూర్తి అధికారం ఉంటుంది.
అంతేకాదు పార్లమెంటరీ వ్యవస్థ పరస్పర సహకారం పై ఆధారపడినందున, ప్రతిపక్ష నేత ప్రధానమంత్రికి పరిపాలనలో సహకరించాలి మరియు అవసరమైతే వ్యతిరేకించటానికి అధికారం ఉంటుంది . “సభ వ్యవహారాలను సజావుగా నిర్వహించడంలో ప్రభుత్వం పాత్ర ఎంత ముఖ్యమో ప్రతిపక్ష నేత పాత్ర కూడా అంతే ముఖ్యం” అని ఆ పత్రాలు చెబుతున్నాయి .
ప్రతిపక్ష నాయకుడిగా పదవిని మొదటిసారిగా స్వీకరించాలని రాహుల్ తీసుకున్న నిర్ణయం అతని విమర్శకులకు రెండు కోణాల సంకేతం ఇచ్చినట్లయింది . బాధ్యతలు స్వీకరించకుండా సిగ్గుపడుతున్నాడని మరియు జవాబుదారీతనం లేకుండా “అధికారం” అనుభవిస్తున్నాడని ఆరోపించే విమర్శకులకు ఇది జవాబు.
లోక్‌సభలో చివరి ప్రతిపక్ష నాయకుడు UPA ప్రభుత్వ హయాంలో ఉన్నారు . సీనియర్ BJP నాయకురాలు సుష్మా స్వరాజ్ డిసెంబర్ 2009 నుండి మే 2014 వరకు ఈ పదవిని నిర్వహించారు. సుష్మా స్వరాజ్ కు ముందు, ఈ పదవిని మే 2009 నుండి డిసెంబర్ 2009 వరకు బిజెపికి చెందిన ఎల్‌కె అద్వానీ నిర్వహించారు. యుపిఎ ప్రభుత్వ మొదటి టర్మ్‌లో, మే 2004 నుండి మే 2009 వరకు అద్వానీ ఈ పదవిలో ఉన్నారు.
అక్టోబర్ 1999 మరియు ఫిబ్రవరి 2004 ల మధ్య, అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వం లో ఎన్‌డిఎ ప్రభుత్వం ఉన్నపుడు , కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్షహానేత గా ఉన్నారు. శరద్ పవార్ మార్చి 1998 నుండి ఏప్రిల్ 1999 వరకు కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు దిగువ సభలో ప్రతిపక్ష నేత గా ఉన్నారు.
ప్రతిపక్ష నేత సీటు లోక్ సభ ముందు వరుసలో ఉంటుంది . సభాపతిగా ఎన్నికైన వారిని రోస్ట్రమ్కు తీసుకెళ్లడం వంటి సందర్భాలలో కొన్ని ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటుంది . పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సమయంలో ప్రతిపక్ష నేత కూడా ముందు వరుసలో సీటు పొందేందుకు అర్హులు.
అంతేకాకుండా, సిబిఐ డైరెక్టర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ మరియు సభ్యులు మరియు లోక్‌పాల్ వంటి కీలక పదవులకు నియామకం కోసం ప్రధానమంత్రి నేతృత్వంలోని అత్యున్నత అధికార కమిటీలలో ప్రతిపక్ష నేత సభ్యుడు .
ప్రాధాన్యత క్రమంలో, కేంద్ర కేబినెట్ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు, పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, నీతి ఆయోగ్ వైస్-ఛైర్పర్సన్, మాజీ పీఎంలతో పాటు లోక్‌సభ మరియు రాజ్యసభలోని ప్రతిపక్ష నేతలు 7వ స్థానంలో ఉంటారు .
రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో రాజ్యాంగబద్ధ పదవిని రాహుల్ చేపట్టడం ఇదే తొలిసారి.ఒక ప్రైవేటు కార్యదర్శి, ఇద్దరు అదనపు పీఎస్‌లు, ఇద్దరు సహాయ పీఎస్‌లు, ఇద్దరు వ్యక్తిగత సహాయకులు, ఒక స్టెనో, ఒక గుమాస్తా, మరో ఐదుగురు ఇతర సిబ్బందిని ఆయనకు కేటాయిస్తారు. అద్దె లేకుండా పూర్తి సదుపాయాలతో నివాస గృహాన్ని వినియోగించుకోవచ్చు.
Discussion about this post