పేద ప్రజలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లుగా వైద్యులు భావించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో వంద పడకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. 4.53 కోట్ల రూపాయలతో ప్రభుత్వాసుపత్రిలో వంద పడకల కోసం అదనపు గదుల నిర్మించినట్టు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని వైద్యులకు సూచించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ 21,22 ప్యాకేజీ పనులను పూర్తి చేయడానికి 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. రెండు ప్యాకేజీలు పూర్తయితే ఎల్లారెడ్డి, కామారెడ్డి ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు అందుతుందని, తద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. తొలుత ఆయనకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
Discussion about this post