ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను 100 కోట్లతో అభివృద్ధి చేసి ఆదర్శ మార్కెట్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్కెట్ లో పని చేస్తున్న 2760 మంది కార్మికులకు 55 లక్షల రూపాయల విలువ చేసే యూనిఫారాలను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించడానికి మార్కెట్టుకు వచ్చే రైతులను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. హమాలీ దగ్గర నుంచి ప్రధాని వరకు ప్రతి ఒక్కరూ రైతు మనుగడను దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలన్నారు. ఎన్నికల్లో ఆశీర్వదిస్తే మోడల్ మార్కెట్ చేస్తానని చెప్పానని, ఇప్పుడది నెరవేరుతోందని చెప్పారు. దీనివల్ల రైతుల, ఖమ్మం పట్టణ ప్రజల సమస్యలు తీరతాయని వివరించారు.
Discussion about this post