సిద్దిపేట జిల్లాలో మార్చి 18 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, మొత్తం 80 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస రెడ్డి చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులను, సెల్ ఫోన్స్ అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.
Discussion about this post