పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని,పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు కి 127వ జయంతి ఇంత ఘనంగా జరిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే బొలిశెట్టితో పాటుగా తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ వలవల బాబ్జీ, బిజెపి నేత ఈతకోట తాతాజీ, అల్లూరి సేవా సమితి నాయకులు మహేంద్ర వర్మ పాల్గొన్నారు.
Discussion about this post