గుజరాత్ లోని 3 గ్రామాలు సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. భారుచ్ జిల్లాలోని కేసర్ గ్రామం, సూరత్ జిల్లాలోని సనధర, బనస్కాంత జిల్లాలోని భఖారీ గ్రామాలు పూర్తిగా ఎన్నికలను బహిష్కరించాయి. ఈ గ్రామాల్లోని 1000 మంది ఓటర్లు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించనందు వల్ల లోక్ సభ ఎన్నికల్లో పాల్గొనడం లేదని అధికారులు తెలిపారు.
దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ప్రాధమిక సమాచారం మేరకు జునాగఢ్ జిల్లాలోని భట్గామ్ గ్రామం, మహిసాగర్ జిల్లాలోని బోడోలి, కుంజరా గ్రామాలలో ఓటర్లు ఎన్నికలను పాక్షికంగా బహిష్కరించారు. అక్కడ కేవలం 350 మంది మాత్రమే ఓట్లు వేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు, రాజకీయపార్టీలు వారిని ఒప్పించడానికి ప్రయత్నించి విఫలం చెందారు. తమ పంచాయతీని విభజించినందుకు నిరసనగా భఖారీ గ్రామస్తులు పోలింగ్ ను అడ్డుకున్నారు. దీంతో ఇంతవరకు ఎవరూ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. బీజేపీ అభ్యర్థి భరత్ సిన్హదాబీ గ్రామానికి వెళ్లి అర్జించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఎన్నికలను బహిష్కరించడం ఇదే మొదటిసారి కాదు. నదిపై బ్రిడ్జి కట్టాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా కార్యరూపం దాల్చకపోవడంతో గ్రామస్తులు అనేక సార్లు ఈ నిర్ణయానికి వచ్చారు.
Discussion about this post