మణుగూరు నుంచి మేడారం: మణుగూరు నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందన్నారు. డిపోల నుంచి 30 బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. భక్తులు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ స్వామి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Discussion about this post