రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు రావటం ఖాయమని కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ స్పష్టం చేశారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నల్లగొండ జిల్లా హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే హరీష్, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ మాట్లాడుతూ విజయ సంకల్ప యాత్రను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. దేశానికి మోది నాయకత్వమే శ్రీరామ రక్ష అని.. మూడో సారి కూడా మోదీ ప్రధాని కావటం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావటం కూడా కష్టమని అన్నారు.
Discussion about this post