విశాఖపట్నం అంటే ముందుగా గుర్తొచ్చేది అందమైన బీచ్ , నౌకావిహార కేంద్రం , ఋషి కొండ, సింహాచలం , దగ్గరలోనే అరకు అందాలు , వెళ్ళేదారిలో కాఫీ తోటలు , ఎర్రమట్టి దిబ్బలు ఇలా చెబుతూ వెడితే చాలా సుందర ప్రదేశాలు ,టూరిస్ట్ ప్రదేశాలకు కొదవే లేదు . కానీ ఇటీవల ఎర్రమట్టి దిబ్బలు ఆక్రమణకు గురవుతున్నాయని వివాదం తలెత్తింది .
విశాఖ సిటీ విస్తరణ , డెవలప్మెంట్ లో భాగంగా 1975 లో భీమిలి పరిసర ప్రాంతాలను డెవలప్మెంట్ ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం భీమిలి హౌసింగ్ సొసైటీ కి 400ఎకరాలు కేటాయించారు. అదే స్దలాన్ని ఐఎన్ఎస్ కళింగ వారు అడుగగా భీమిలి హౌసింగ్ సోసైటి కి పక్కనే ఉన్న 373.5 ఎకరాలు కేటాయించారు. కాని గత కొద్దిరోజులు గా ఎర్రమట్టి దిబ్బలు అన్యాక్రాంతం అని పుకారులు రావటం జరిగింది. దీంతో జియోలాజికల్ సర్వే అధికారులు , అటు భీమిలి హౌసింగ్ సొసైటీ వారు అప్రమత్తమయ్యారు .
జియోలాజికల్ సర్వే అధికారులు సుమారు 91 .5 ఎకరాలు నో డెవలప్మెంట్ జోన్ గా ప్రకటించారు . కానీ 91 . 5 ఎకరాలకు ఏవిధమైన నష్టపరిహారం భీమిలి హౌసింగ్ సొసైటీ కి చెల్లించలేదని సొసైటీ సభ్యులు చెబుతున్నారు . భీమిలి హౌసింగ్ సొసైటీ 91 .5 ఎకరాల భూమిని వదలి మిగతా భూమిని డెవలప్మెంట్ చేస్తున్నామన్నారు .
మరో వైపు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఛైర్మెన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ విశాఖలో మాదిరి ఎర్రమట్టి దిబ్బలు తమిళనాడులో తప్ప మరెక్కడా లేవని కాబట్టి వాటిని వారసత్వ సంపదగా కాపాడుకోవలసి అవసరం ఉందన్నారు .
ఏదేమైనా ఈ అంశం పై ప్రభుత్వం త్వరగా స్పందించి భీమిలి హౌసింగ్ సొసైటీ కి న్యాయం చేస్తూ , ప్రజల్లో నెలకొన్న అనుమానాలు తొలగించి , ప్రకృతిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Discussion about this post