సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సైబరాబాద్ 6th Annual Sports & Games Meet-2024 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా హాజరయ్యారు. ఈ క్రీడల్లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ అవినాష్ మహంతి, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ ప్రాక్టీస్ నెట్, ఓపెన్ జిమ్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ రవి గుప్తా ప్రారంభించారు. ముందుగా మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెం ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ గాలిలోకి తుపాకీ కాల్చి పోటీలను ప్రారంభించారు. పురుషుల విభాగంలో రమేష్ పిసి సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, మహిళల విభాగంలో రమాదేవి పిసి సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ గెలుపొందారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా మాట్లాడుతూ… డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మహంతి, పిలుపు మేరకు సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2024 లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తున్నపోలీసులను అభినందించారు. ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించిన సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ను అభినందించారు. పోలీస్ సిబ్బంది బ్యాండ్ డిస్ ప్లే, మార్చ్ ఫాస్ట్ అసాధారణంగా ఉందన్నారు. క్రీడలతో ఫిట్ గా ఉండొచ్చన్నారు. క్రీడల్లో గెలుపు కంటే పాల్గొనడం ముఖ్యమన్నారు. పోలీసులు ఇదే స్ఫూర్తిని ప్రొఫెషన్ లోనూ చూపించాలన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా, ఏ వృత్తిలోనైనా ఫలితం ఉంటుందన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు.
సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. సైబరాబాద్ లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఏర్పాటు చేయడం వరుసగా ఇది 6వ సారి అన్నారు. క్రీడలు నాయకత్వ లక్షణాలను వెలికితీయడంతోపాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించి ఫిట్నెస్ ను కాపాడుకోవాలని, రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా కోసం కేటాయించుకోవాలన్నారు.
Discussion about this post